35.2 C
Hyderabad
April 20, 2024 15: 33 PM
Slider మహబూబ్ నగర్

గ్రామ పంచాయతీలలో విరివిగా మొక్కలు నాటాలి

#Haritaharam

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈ నెల 17వ తేదీన వనపర్తి జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామపంచాయతీలో 1000 మొక్కలు చొప్పున నాటనున్నట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష తెలిపారు.

ఈ విషయమై శుక్రవారం ఆమె కలెక్టర్ కార్యాలయంలో ఎం.పీ.డీ.వో.లు, ఎం.పి. ఓ.లు, ఏ.పీ.ఓ. లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

17వ తేది ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు సామూహికంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని ఆమె తెలిపారు. ఇందుకుగాను మొక్కలను తేది:16.2.2021 నాటికి గ్రామ పంచాయతీలలో మొక్కలు డంపు చేసుకోవాలని అన్నారు.

పనిచేయని ఎం.పి.వో.లు, ఏ.పీ.ఓ. లను సిసియే రూల్స్ ను అనుసరించి చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. రహదారులకు ఇరువైపుల సంస్థలలో పెద్ద మొక్కలు నాటాలని కలెక్టర్ కోరారు. 

ఈ కార్యక్రమానికి డి.ఆర్.డి.ఓ. కోదండరాములు, జెడ్పీ సీఈవో నరసింహులు, డి.పి.ఓ. సురేష్ కుమార్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

నిత్యావసర వస్తువుల పెరుగుదల పై టీడీపీ నిరసన….

Satyam NEWS

జో బిడెన్ కే భారత సంతతి అమెరికన్ల ఓట్లు

Satyam NEWS

నేరాల నియంత్రణపై ద్రుష్టి పెట్టాలి

Bhavani

Leave a Comment