35.2 C
Hyderabad
April 24, 2024 13: 27 PM
Slider నిజామాబాద్

గ్రీన్ ఈజ్ ద లైఫ్: మానవ మనుగడకు చెట్లే కీలకం

pocharam

మానవ మనుగడకు చెట్లే కీలకమని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయ సమీపంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరిత రక్షక వనంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ మనిషి మనుగడకి చెట్టే ఆధారమన్నారు. ఈ ప్రాంతంలో చెట్లు లేకపోవడం వల్ల వర్షాలు పడేవి కావన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 5 సంవత్సరాల క్రితం మంచి సంకల్పంతో 230 కోట్ల మొక్కలు నాటాలని తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 82 కోట్ల మొక్కలు నాటడం జరిగిందన్నారు.

కామారెడ్డి పోలీసు శాఖ ఆధ్వర్యంలో 6 ఎకరాల స్థలంలో 3500 మొక్కలు నాటడం అభినందనీయమని ఎస్పీ శ్వేతారెడ్డిని అభినందించారు. చెట్లు లేకపోతే వేడిమి పెరిగి మంచు కొండలు కరిగి జలప్రళయం సంభవిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని అన్నారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ దూరాలోచన చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకుంటే మనల్ని మనం కాపాడుకున్నట్టేనని తెలిపారు.

ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. మూడు సంవత్సరాల కాలంలో 6 ఎకరాల స్థలంలో ఇంతమంచి వాతావరణం సృష్టించడం అభినందనీయమన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన విధానం చాలా గొప్పదని, భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం కల్పించాలన్న సంకల్పంతో హరితహారం కార్యక్రమం చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని రాష్ట్రాలన్ని తెలంగాణ వైపు చేస్తున్నాయని చెప్పారు.ఈ కార్యక్రమం పోలీసు శాఖ చేయడం మాములు విషయం కాదన్నారు. ఓవైపు ప్రజలకు రక్షణగా ఉంటు మరోవైపు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం హర్షించదగ్గ విషయమన్నారు.

మరో రెండు మూడు సంవత్సరాలలో ఈ ప్రాంతం అడవిలా మారుతుందని చెప్పారు. అనంతరం స్పీకర్ చేతుల మీదుగా పోలీసు హరిత రక్షక వనం పోస్టర్ ను ఆవిష్కరించి అటవీశాఖ, పోలీసు శాఖ అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి, అడిషనల్ ఎస్పీ అన్యోన్య, జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.

ఇంకా మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపా రావు, స్థానిక వార్డు సభ్యురాలు గడ్డమీడి రాణి, అసిస్టెంట్ కలెక్టర్ తేజాస్ నందన్ లాల్ పవార్ పోలీసు సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పడకల పెంపునకు చర్యలు

Satyam NEWS

సిబిఐటి కళాశాల లో  అరుదైన ‘జీరో షాడో’ డే

Satyam NEWS

వచ్చే నెల లో ప్రధాని చేతుల మీదుగా భోగాపురం ఎయిర్ పోర్ట్ కు శంకుస్థాపన

Satyam NEWS

Leave a Comment