జిల్లాలో పోడు భూములను సాగు చేసుకునేందుకు ఏళ్ల తరబడి గిరిజన గిరి శిఖర గ్రామాల్లో ఉన్న గిరిజనలకు హక్కలు కల్పించాలంటూ దాదాపు వంద మంది ఆదివాసీలు..జాతీయ రహదారిని అందునా విజయనగరం కలెక్టర్ వద్ద దాదాపు గంట సేపు దిగ్బంధించారు. భానుడు మాడు పగులగొడుతున్నా.. రోడ్లు పగులుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా…కలెక్టరేట్ అవుట్ గేట్ వద్ద ధర్నా చేసిన ఆదివాసీలు ఒక్కసారిగా..కలెక్టరేట్ జంక్షన్ ను దిగ్బంధించారు. దాదాపు వంద మంది గిరిజనులు…జాతీయ రహదారిపైనే భైఠాయించి…తమ డిమాండ్ల కు సరైన హామీ ఇచ్చేంతవరకు,,,వచ్చేంతవరకు తగ్గేది లేదని భీష్మించుకున్నారు.
ఈ క్రమంలో మామూలు ధర్నానే అనుకున్న పోలీసులు…వన్ టౌన్ ఎస్ఐ తారకేశ్వరరావు..పీసీ దామోదర్ తో నలుగురు ఎస్టీఎఫ్ తో వచ్చారు.కానీ…ఒక్కసారి ఎవ్వరూ ఊహించని రీతిలో ఆదివాసీలు…జాతీయ రదహారిని దిగ్బంధించారు.దీంతో అటు విశాఖ,ఇటు సాలూరు,ఎస్.కోట వైపు నుంచీ వచ్చే వాహనాలు దాదాపు కిలోమీటర్ల పొడువను నిలచిపోయాయి. ధర్నా చేస్తున్న,రోడ్ ను దిగ్బందించిన ఆదివాసీలను అక్కడ నుంచీ లేవాలని అక్కడే ఉన్న ఒకే ఒక ఎస్ఐ తారకేశ్వరరావు…ఎన్ని సార్లు చెప్పినా..ఎంత చెప్పినా ఆదివాసీలు పట్టించుకోలేదు.సరికదా…కలెక్టరేట్ నుంచీ ఏ ఒక్క అధికారి వచ్చి మాకు హామీ ఇస్తే గాని కదలేది లేదని ఆదివాసీ నేత తుమ్ము అప్పలరాజు దోర తెగేసి చెప్పారు.. అయితే ఆదివాసీ నేత…కలెక్టరే్ట్ లో. .డీఆర్ఓ అనితకు గోడు వెళ్లబోసుకోవడంతో..కలెక్టర్ దృష్టికి తీసుకెళతానని హామీ ఇవ్వడంతో…ఎట్టకేలకు ఆదివాసీలు తమ ఆందోళనను విరమించారు.