విజయనగరం జిల్లాలో గిరిజన ప్రాంతాలలో ఉన్న పోడు భూములను గిరిజనులకే ఇవ్వాలని కోరుతూ విజయనగరం పూల్ భాగ్ అటవీ శాఖ కార్యాలయంలో డీఎఫ్ఓ ఛాంబర్ వద్ద గిరిజనలు నిరసన వ్యక్తం చేశారు. గిరిజన సమాఖ్య నేత అప్పలరాజు దొర ఆధ్వర్యంలో దాదాపు 150 మంది గిరిజనలు డీఎఫ్ఓ ఛాంబర్ ముందు అరగంటసేపు ధర్నా చేశారు. అనంతరం డీఎఫ్ఓ బయటకు వచ్చి గిరిజనుల సమస్యలను సావధానంగా విన్నారు. 2016 నుంచీ అటవీ శాఖ కొత్త చట్టం వచ్చిందని డీఎఫ్ఓ అన్నారు. అయితే ఇక్కడే అటు ఫారెస్ట్ అధికారులకు, ఇటు గిరిజనులకు వాదోపవాదాలు జరిగాయి. 2004 నుంచే మా అటవీ భూముల్లో మమ్మల్ని సాగు చేయనీయకుండా చట్టాల పేరుతో మోసం చేస్తూ వచ్చారని అప్పలరాజు దొర ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త చట్టం గురించి అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని అప్పలరాజు దొర, డీఎఫ్ఓకు వినతిపత్రం ఇచ్చారు.
previous post