28.7 C
Hyderabad
April 24, 2024 03: 11 AM
Slider వరంగల్

వయెావృద్ధులైన తల్లిదండ్రుల బాధ్యత పిల్లలదే….

అనురాగ్ హెల్పింగ్ సొసైటి ప్రెసిడెంట్ అండ్ సీనియర్ సిటిజన్౭ టిృబునల్ బెంచ్ మెంబర్ (Tribunal bench) డాక్టర్ కె. అనితా రెడ్డి, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ కమిటీ హనుమకొండ వారు ప్రపంచ వయెావృద్ధుల వేధింపుల పై అవగాహన సదస్సు కార్యక్రమం హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లో టవున్ హల్ లో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ బండా ప్రకాష్, DCP అశోక్ కుమార్, Dwo శారద, సబిత , విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాటలాడుతూ తల్లిదండ్రులను చూసుకోవడం పిల్లల బాధ్యత అని లేని పక్షంలో చట్ట పరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. సీనియర్ సిటిజన్ ట్రిబునల్ బెంచ్ పట్ల ( వృద్ధుల కోర్టు) ప్రతి ఒకరికి అవగాహన అవసరం అని, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు న్యాయము కొరకు Tribunal bench ని సందర్శించి ఫిర్యాదు చేయాలని కోరారు. చట్టాలను వినియెగించుకోవాలని, పెన్షన్లో ఇబ్బందులు పడుతున్న, పిల్లలతో ఇబ్బందులు పడుతున్న లేదా ఇంకా ఏరకమైన ఇబ్బంది ఎదురైన దైర్ఘ్యంగా Tribunal bench ని వినియెగించుకొని సమస్య పరిష్కారించుకోవాలని తెలిపారు.

వృద్ధులను గౌరవించి ఆదరించాలని అన్నారు. టిృబునల్ బెంచ్ వృద్ధులకు ఎంతో ఆసరా అని చెప్పారు. వృద్ధుల హక్కులను కాపాడటం అందరి భాద్యత, వారిని గౌరవంగా చూడటం మన సంస్కారానికి నిదర్శనం అని అతిధులు తెలిపారు. పోలీసులు వృద్ధులకు ఏ అవసరం వచ్చిన వెంటనే రక్షణ కలుగ జేయాలని ప్రతి చట్టంలో పొందిపరచి ఉందని, ఏ అవసరం ఉన్న 100 లేదా 14567 టోల్ ఫీ నెంబర్ కి కాల్ చేయాలని తెలిపారు.

ఏది ఏమైనప్పటికీ ప్రతి ఒక్కరం వృద్ధులకు అండగా ఉంటామని హమి ఇచ్చారు. అనంతరం వయెావృద్ధుల పోషణ మరియు సంకేమ చట్టం పుస్తకం మరియు వృద్ధుల టోల్ ఫీ నెంబర్ 14567 గోడ పత్రిక ను అతిధుల చేతుల మీదుగా ఆవిష్కరణ చేసారు. ఎ. చంద్రమౌళి, వి. దేవాచారి, ఫీల్డ్ ఆపిసర్ రవి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్

Satyam NEWS

గుర్తింపు ఇచ్చిన సమాజానికి తిరిగి ఇవ్వాలనే….

Satyam NEWS

త్వరలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు

Murali Krishna

Leave a Comment