32.2 C
Hyderabad
March 29, 2024 00: 39 AM
Slider శ్రీకాకుళం

దామోదర సంజీవయ్య కు ఘన నివాళి

#Damodara Sanjeevaiah

దామోదర సంజీవయ్య 102 వ జయంతి సందర్భంగా దామోదర సంజీవయ్య మెమోరియల్ ట్రస్టు ఘననివాళిం అర్పించింది. దేశ చరిత్రలో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాల దృష్ట్యా సమాజంలో నవ చైతన్యం కలిగించడానికి కొందరు మహానుభావులు జన్మిసారు. బహు జనాదరణ, బహుజనాకర్షణ పొందగలిగిన వ్యక్తులు బహు కొద్దిమందే ఉంటారు.

అటువంటి వ్యక్తి మహామనీషి, సామాజిక వేత్త దామోదర్ సంజీవయ్య. 1921 ఫిబ్రవరి 14 తేదిన జన్మించిన ఆయన చిన్న వయస్సులోనే ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. 39 ఏళ్లకే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైనారు. రాజ్యాంగ పరిషత్ సభ్యులుగా ఎన్నికయ్యారు.. కేంద్ర మంత్రిగా అనేకమైన కీలకమైన పదవులు నిర్వహించారు.

దేశం మరియు రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. రాయలసీమలోని భోయకులాన్ని యస్. టి జాబితాలో చేర్చారు. కోస్తా ప్రాంతంలో కాపులను, రాయలసీమ బలిజలను BC జాబితాలో చేర్చారు. మండల కమిషన్ కంటే ముందే BC లకు రిజర్వేషన్లు అమలు అయ్యేలా 1961 లో ఉత్తర్వులు జారీ చేశారు. వృద్ధులు ఫించనులు ఆలోచన కు నాంది పలికారు. ఈ కార్యక్రమంలో సంజీవయ్య మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షుడు డా.

గంజి ఎజ్రా అధ్యక్షుడుగా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా రెడ్ క్రాస్ శ్రీకాకుళం జిల్లా చైర్మన్ శ్రీ జగన్మోహన్ రావు ట్రస్టు సభ్యులు మాజీ సర్పంచ్ అప్పన్న, మాజీ కౌన్సిలర్ జి. సింహాద్రి, పి. యమ్. రాజు, బి. రవీంద్ర బాబు, ఆర్ ప్రసాద్, యన్. కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రకృతికి ప్రణామం

Satyam NEWS

నందలూరు లో రాయల సీమ ఎక్స్ ప్రెస్ నిలుపుదల కు వినతి

Satyam NEWS

భయపడాల్సిన పని లేదు నేనున్నాను

Satyam NEWS

Leave a Comment