36.2 C
Hyderabad
April 24, 2024 19: 59 PM
Slider నెల్లూరు

స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ కు నివాళి

#vikramsimhapuri

స్వాతంత్య్ర సమరయోధుడు తొలి విద్యాశాఖా మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయలో ఘన నివాళి అర్పించారు. శ్రీ పొట్టి శ్రీరాములు భవన్ లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్ర పటానికి రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్.విజయ కృష్ణ రెడ్డి పూలమాలలు వేశారు.

ఈ సందర్భంగా రిజిస్ట్రార్ విజయ కృష్ణ రెడ్డి మాట్లాడుతూ అబ్దుల్ కలాం ఆజాద్ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనటమే కాకుండా మతం ప్రాధాన్యత మీద లేదా ఇంకో ప్రాధాన్యత మీద దేశ విభజన సమంజసం కాదని గట్టిగా వాదించిన వ్యక్తి అని అన్నారు. దేశ సమగ్రత సమైక్యత కోసం అహరహం కృషి చేసిన మహాన్నీయులు ఆయన అని డాక్టర్ ఎల్.విజయ కృష్ణ రెడ్డి అన్నారు.

అరబ్బీ ఇంగ్లీష్ నేర్చుకున్నప్పటికి భారత దేశం సన్నిహితంగా ఉండాలని భారత దేశం పురోగమనం వైపు పయనించాలని భారతీయులు అందరూ కూడా పురోగమించాలని మనసా వాచా కర్మణా నమ్మినటువంటి వ్యక్తి ఆయన అన్నారు. మొట్టమొదటి దేశ విద్యా శాఖ మంత్రిగా దేశంలో అందరూ అక్షరాసి తరణించాలని కృషి చేసిన అటువంటి మహనీయుడు జయంతిని పురస్కరించుకుని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఘనంగా నివాళ్ళు అర్పించడం ఎంతో అదృష్టం అని డాక్టర్ ఎల్.విజయ కృష్ణ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో పరీక్ష నియంత్రణ అధికారి డాక్టర్ సాయి ప్రసాద్ రెడ్డి, ఎన్ యస్ యస్ సమన్వయకర్త డాక్టర్ ఉదయ్ శంకర్ అల్లం, బోధన బోధనేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

బీసీలకు అన్యాయం చేసిన సీఎం జగన్

Bhavani

గోల్డెన్ లెగ్: బంగారు ప్లేట్ పై కేటీఆర్ బొమ్మ

Satyam NEWS

మట్కా ఆడిన వ్యక్తిపై పిడి చట్టం ప్రయోగించిన పోలీసులు

Satyam NEWS

Leave a Comment