శ్రీ వాసవి మాత ముద్దుబిడ్డ అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నాయుడుపేట ఆర్యవైశ్య సంఘం, యువజన సమైక్య సభ్యులు ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా రూరల్ అధ్యక్షులు గూడూరు కిషోర్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి కామర్లపూడి సుబ్రహ్మణ్యం, గాదం శెట్టి నాగరాజు, ప్రధాన కార్యదర్శి సొల్లేటి చంద్రశేఖర్, మెంటా మల్లికార్జున్, గూడూరు కిరణ్ కుమార్, కంకిపాటి కిరణ్ కుమార్, యతేంద్రబాబు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, యువజన సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్దకు పెద్ద ఎత్తున వెళ్లి ఆంధ్రుల గుర్తింపు కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడికి నివాళి అర్పించారు. పొట్టి శ్రీరాములు త్యాగానికి జోహార్లు తెలుపుతూ నినాదాలు చేశారు.
previous post
next post