32.2 C
Hyderabad
March 28, 2024 23: 23 PM
Slider హైదరాబాద్

వాజ్ పేయి జీవిత చరిత్ర పాఠ్యాంశంగా చేర్చాలి

#Raju Neta

భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి రెండో వర్ధంతి సందర్భంగా ఓయూ జెఏసి నాయకులు ఎనుగంటి రాజు నేత ఘన నివాళి అర్పించారు. భారతరత్న,  పద్మవిభూషణ్, బెస్ట్ పార్లమెంటేరియన్ ,కవి, రచయిత, మాజీ ప్రధాని,  భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక సభ్యుడు, భారతీయ జనతా పార్టీ మొదటి అధ్యక్షుడు, పదిసార్లు ఎంపీ, రెండుసార్లు రాజ్యసభ సభ్యుడు గా ఆయన ఘనత సాధించారని రాజునేత అన్నారు.

అణు పరీక్షలు నిర్వహించి ప్రధానమంత్రి గా దేశ ప్రతిష్టను పెంచిన వ్యక్తి ఆయన అని రాజు నేత అన్నారు. పొరుగున ఉన్న పాకిస్తాన్ తో సహృద్భావ వాతావరణ నెలకొల్పేందుకు 1999లో పాకిస్తాన్ భారత్  మధ్య బస్సు సర్వీసులు నడిపించిన ఘనతను కూడా వాజ్ పేయి సాధించారని ఆయన అన్నారు.

ఐక్యరాజ్యసమితిలో  మొదటి సారిగా హిందీ లొ మాట్లాడిన ఘనత ఆయనకు దక్కుతుందని, తన జీవితంలో 47 సంవత్సరాలు ఎంపీగా దేశంలోని నాలుగు రాష్ట్రాల నుంచి సేవలందించడం అందరికీ ఆదర్శప్రాయం అని అన్నారు. దేశాన్ని ప్రగతి పథం వైపు నడిపించడంలో ఆయన  పాత్ర గణనీయమైనది గా  ఉంది అని రాజునేత ఆయన వర్ధంతి రోజున ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.

దేశం ఆయనను ఎప్పటికీ మరచిపోదని ఆయన సేవలను భావి తరాల వారు తెలుసుకోవాలంటే తెలంగాణ రాష్ట్రం పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని ఓయూ జేఏసీ నాయకులు రాజు నేత డిమాండ్ చేశారు.

Related posts

మద్యం అమ్మాలని ప్రధాని మోడీ చెప్పలేదు

Satyam NEWS

గడప గడపకు నిరసన సెగలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఆళ్ల నాని

Bhavani

ఢిల్లీ హింసపై 22 కేసులు నమోదు చేసిన పోలీసులు

Satyam NEWS

Leave a Comment