37.2 C
Hyderabad
April 19, 2024 10: 57 AM
Slider విజయనగరం

గురజాడ వర్ధంతి కార్యక్రమంలో విజయనగరం పోలీసు బాస్…!

#gurajada

కలెక్టర్ తో కలిసి కలెక్టరేట్ లో నివాళులు అర్పించిన ఎస్పీ దీపికా…!

మహాకవి గురజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్య కుమారితో పాటు పోలీసు బాస్ దీపికా కూడా నివాళులు అర్పించారు. ఈ మేరకు విజయనగరం కలెక్టరేట్ లో ఉన్న గురజాడ విగ్రహానికి అటు కలెక్టర్, ఇటు ఎస్పీలు ఘనంగా నివాళులు అర్పించారు. స్వర్గీయ గురజాడ అప్పారావు ఎన్ని యుగాలైన మరచిపోలేని వ్యక్తి అని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి పేర్కొన్నారు. 

గురజాడ వర్ధంతి సందర్భంగా  కలెక్టరేట్ లో ఎమ్మెల్యే కంబాల జోగులు, జె.సి మయూర్ అశోక్ తో కలసి పూల మలాలంకరణ గావించి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ తోటి వారికి సహాయాన్ని అందించాలని గురజాడ  చెప్పిన మాటలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని తెలిపారు. ప్రపంచం గర్వించ తగ్గ వ్యక్తి గురజాడ యని,     ఆయన ఆశయాలను భావి తరాలకు అందించడమే ఆయనకు  నిజమైన నివాళి యని అన్నారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ గణపతి రావు,ఏఓతో పాటు  జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Related posts

లవర్స్: మూడు రోజులకు తేలిన మృతదేహాలు

Satyam NEWS

సమ్మె: రామగుండంలో విధులకు హాజరుకాని కార్మికులు

Satyam NEWS

తెలంగాణ ప్రజా ప్రతినిధుల్ని హతమార్చేందుకు మావోల ప్లాన్

Satyam NEWS

Leave a Comment