27.7 C
Hyderabad
April 25, 2024 09: 42 AM
Slider విజయనగరం

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం వారం రోజుల పాటు

#vijayanagarampolice

1998 బహుశా ఈ ఏడాది ని విజయనగరం జిల్లా పోలీస్ శాఖ మర్చిపోదేమో. అదే ఏడాది లో సాలూరు న్యాయస్థానం లో అప్పటి కొమరాడ ఎస్ఐ..కొప్పడంగి ఎన్ కౌంటర్ కేసు విషయంలో  కోర్టు లో జడ్జి ముందు విచారణ జరుగుతుండగానే న్యాయస్థానం సాక్షిగా మావోల తూటాలకు అశువులు బాసారు…సీఐ గాంధీ. ఈ క్రమంలో ప్రతీ ఏటా అక్టోబర్ 21 జరగనున్న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజు సీఐ గాంధీ ని స్మరించుకోవడం క్రమం తప్పకుండా వస్తోంది.

ఈ నేపథ్యంలో అక్టోబరు 21 నుండి 30వరకు పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు. పోలీసు అమవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో అక్టోబరు 21 నుండి 31వరకు పలు కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ నిర్వహిస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక  తెలిపారు.

విధి నిర్వహణలో అసువులుబాసిన వారికి నివాళి

విజయనగరం ఎస్ పి దీపికా పాటిల్

ఈ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా  21న జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణంలోగల స్మృతి వనంలో విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించనున్నామని జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణం లో గల స్మృతి వనంలో పోలీసు అమర వీరుల త్యాగాలను స్మరిస్తూ స్మృతి పరేడ్ నిర్వహించి, ఘనంగా నివాళులు అర్పిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి, జిల్లా కలెక్టరు, ఇతర ప్రముఖలు, పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొంటారని జిల్లా ఎస్పీ తెలిపారు.

26 వ తేదీన జిల్లా కేంద్రంలోని ఏఆర్ పరేడ్ గ్రౌండులోను, విజయనగరం సబ్ డివిజన్ పరిధిలో ని వివిధ పోలీసు స్టేషనుల్లోను ‘ఓపెన్ హౌస్’ కార్యక్రమాన్ని నిర్వహించి, పోలీసులు నిర్వహించే విధులు, ఆయుధాలు పట్ల, వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం గురించి ప్రజలకు, విద్యార్ధులకు అవగాహన కల్పిస్తామన్నారు. అదే విధంగా బొబ్బిలి , పార్వతీపురం సబ్ డివిజను పరిధిలోని వివిధ పోలీసు స్టేషన్లులో ‘ఓపెన్ హౌస్’ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు.

22, 23 తేదీన పోలీసు అమర వీరుల స్వగ్రామాలను, వారి గృహాలను పోలీసు అధికారులు, మహిళా పోలీసులతో సందర్శించి, వారి త్యాగాలను ప్రజలకు తెలియపర్చే విధంగా కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. అదే విధంగా పోలీసు అమరవీరులు చదువుకున్న పాఠశాలలను ,కళాశాలలను సందర్శించి, వారి త్యాగాలను విద్యార్థులకు తెలియపర్చి, వారి ఫోటోలను పాఠశాలలు, కళాశాలల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు.

స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో వారి నివాస ప్రాంతాల్లో రహదారులకు పోలీసు అమరవీరులు పేర్లు పెట్టే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. 24,25 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలలు, కళాశాలల్లో “కరోనా సమయంలో పోలీసులు చేసిన నిస్వార్ధమైన సేవలు” అనే అంశం పై వ్యాస రచన మరియు డిబేట్ పోటీలను కరోనా నిబంధనలను పాటిస్తూ, వీడియో కాన్ఫరెన్సు ద్వారా నిర్వహిస్తామన్నారు.

వ్యాస రచన, డిబేట్ పోటీలను విద్యార్ధులు, పోలీసు పిల్లలు, పోలీసు ఉద్యోగులకు వేరు వేరుగా నిర్వహించి, మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి నగదు బహుమతులను అందించనున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. 28న పోలీసు పరేడ్ గ్రౌండులో రక్తదాన శిబిరం, శార్వాణి పోలీసు సంక్షేమ పాఠశాలలో తిరుమల నర్సింగ్ హెం సహకారంతో వైద్య శిబిరాన్ని నిర్వహించి పోలీసు కుటుంబాలకు, ఇతర ప్రజానీకానికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, మందులను ఉచితంగా అందించనున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.

28వ తేదీన సాయంత్రం 6 గంటలకు విజయనగరం పట్టణంలోని కోట జంక్షన్ వద్ద బ్యాండు షోను నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. అదే విధంగా  29న బొబ్బిలి సబ్ డివిజను కేంద్రంలోను, 30న పార్వతీపురం సబ్ డివిజను కేంద్రంలోను బ్యాండు షో లను నిర్వహిస్తామన్నారు. 29న  జిల్లా వ్యాప్తంగా వెబినార్ ద్వారా ‘పోలీసుల త్యాగాలు” పై సెమినార్‌ను నిర్వహిస్తున్నామన్నారు.

30 న వివిధ రంగాల్లో రాణిస్తున్న పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులను గౌరవించి, ప్రోత్సహించేందుకు చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ తెలిపారు.

Related posts

పొంగులేటికి డబుల్ ధమాకా

Bhavani

కాకినాడ ప్రెస్ క్లబ్లో జర్నలిస్టు మిత్రుల ఆత్మీయ కలయిక

Bhavani

తొలి బ్యాచ్ ఆర్టీసీ శిక్షణ పొందిన డ్రైవర్లకు సర్టిఫికెట్లు

Satyam NEWS

Leave a Comment