36.2 C
Hyderabad
April 23, 2024 20: 54 PM
Slider శ్రీకాకుళం

తెలుగు ఖ్యాతిని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్

#gundalaxmidevi

ఎన్టీఆర్ 98వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఈరోజు శ్రీకాకుళం లోని 7రోడ్ జంక్షన్ లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, చింతూ సుధాకర్, పి ఎం జె.బాబు, మాదిగ రమణ పాల్గొన్నారు. ఎప్పుడు ఘనంగా జరుపుకొనే ఎన్టీఆర్ జయంతి ఈ సంవత్సరం కరోనా కారణంగా తక్కువ మందితో జరుపుకోవల్సివచ్చింది అని లక్ష్మీదేవి  తెలియజేశారు.

లక్ష్మీదేవి మాట్లాడుతూ బియ్యం అంటే తెలియని  పేదోడు అన్నం తినే లా చేసింది, వంట ఇల్లు తప్ప వేరే ప్రపంచం తెలియని ఆడబిడ్డ కు రాజకీయాలపై ఆసక్తి తెచ్చింది, పేదవాడు సారా తాగి ఇల్లు గుల్ల చేసుకోకుండా మద్యపాన నిషేధం చేసినది, మునసబు కరణం  రద్దుచేసి గ్రామాల్లో అక్రమాలు ఆపింది ఆ మహనీయుడు  ఎన్టీఆర్ అని తెలిపారు.

ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల సంక్షేమం కోసం పాటు పడ్డారని, రూ.50లకే  రైతులకు విద్యుత్, రైతులకు ఉచితంగా  పట్టాదారు పాసు పుస్తకాలు అందించి భూ సమస్యల పరిష్కారానికి నాంది పలికిన మహానీయుడని ఆమె అన్నారు.

ప్రాంతీయ పార్టీని స్థాపించి ఎన్టీఆర్ 9  నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఆయన రాష్ట్రానికే పరిమితం కాకుండా జాతీయ రాజకీయాలలో సైతం ప్రముఖ పాత్ర పోషించారు అని తెలియజేశారు.

అదేవిధంగా రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం బలంగా ఉంటుందని ఎన్టీఆర్  చెప్పేవారు  ముఖ్యమంత్రి గా ఉండే ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయికి మాత్రమే జీతం తీసుకున్నారు తీసుకున్న ఎన్టీఆర్ వంటి అత్యున్నత  నాయకుడుగా జీవించాడు అని ఆమె అన్నారు.

అదేవిధంగా ఆయనకు భారతరత్న ప్రకటించాలని ప్రభుత్వాన్ని తెలుగుదేశం తరఫున డిమాండ్ చేస్తున్నాం తెలియజేశారు

Related posts

సినీ దర్శకుడు త్రివిక్రమ్ కారుకు చలానా

Satyam NEWS

నేరస్థులకు శిక్ష పడితే పోలీసులకు ప్రజలు మరింత దగ్గరవుతారు

Bhavani

70 మంది ఆర్టీసీ ఉద్యోగులను సస్పెండ్ చేసిన అధికారులు

Satyam NEWS

Leave a Comment