30.2 C
Hyderabad
September 14, 2024 15: 51 PM
Slider సంపాదకీయం

ఎన్నో సమస్యలకు తలాఖ్ చెప్పేస్తున్నారు

Ravishankar Prasad

తలాఖ్ బిల్లుకు చట్ట రూపం తీసుకురావడంతో బిజెపి తాను ఎంతో సాధించేసిన ధీమా వ్యక్తం చేస్తున్నది. సొంత బలం లేని రాజ్యసభలో బిల్లు నెగ్గడం విజయం కావచ్చు కానీ తలాఖ్ బిల్లు ఒక్కటే దేశంలోని అన్ని సమస్యలకు పరిష్కారం కాదనే వాస్తవం బిజెపి మరచిపోరాదు. దేశాన్ని ఎన్నో సమస్యలు ఇప్పుడు పట్టిపీడిస్తున్నాయి. మరీ ముఖ్యంగా దేశ ఆర్ధిక పరిస్థితి ఆశించినంతగా ముందుకు వెళ్లడంలేదు. పారిశ్రామిక రంగం రోజు రోజుకూ దిగజారిపోతున్నది. అయితే వాటన్నింటింని పక్కన పెట్టిన బిజెపి తలాఖ్ బిల్లును ముందు తెచ్చుకున్నది. తన శక్తి మొత్తాన్నీ కూడదీసుకుని రాజ్య సభలో విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ్యులను నిస్సిగ్గుగా తమలో కలిపేసుకుంది. చాలా పార్టీలు నిరసన పేరుతో సభ నుంచి బయటకు వెళ్లేలా చేసుకుంది. రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245 కాగా బిల్లు ఆమోదానికి 121 మంది సభ్యులు మద్దతు పలకాలి. 245 మంది సభ్యులున్న రాజ్యసభలో టీడీపీకి చెందిన నలుగురు బీజేపీలో చేరడంతో ఆ పార్టీ బలం 102 నుండి 106కు మాత్రమే చేరింది. పలు పార్టీలు బిల్లును వ్యతిరేకించగా, మరికొన్ని పార్టీలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. దాంతో సభలో అందుబాటులో ఉన్న సభ్యులతోనే ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 99, వ్యతిరేకంగా 84 ఓట్లు లభించాయి. 121 ఓట్లు కావాల్సిన చోట 99 ఓట్లు రావడం సాంకేతిక విజయమే తప్ప నైతిక విజయం కాదని బిజెపి గుర్తుంచుకోవాలి. ఇటీవలే లోక్ సభలో కూడా ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదముద్ర పడింది. లోక్‌సభలో ఈ బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 303 ఓట్లు వస్తే, వ్యతిరేకంగా 82 ఓట్లు వచ్చాయి. ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, జేడీ(యూ), టీఎంసీ లోక్‌సభ నుండి వాకౌట్ చేశాయి. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు 2017లోనే చెప్పింది. అయితే అప్పటి నుంచి బిజెపి వేచి చూసి ఎన్నికల సమయానికి ఆ అంశాన్ని తలకెత్తుకుంది. రాజ్యసభలో మెజారిటీ లేకపోవడంతో ఇంత కాలం వేచిచూడాల్సి వచ్చింది. రెండో సారి అధికారంలోకి రాగానే తలాఖ్ బిల్లును గట్టెక్కించుకుంది. ట్రిపుల్ తలాక్ పద్ధతిని ఇస్లామిక్ దేశాలు కూడా వ్యతిరేకిస్తున్నాయని, పలు దేశాలు ఇప్పటికే తలాక్ పై నిషేధం విధించాయని చెబుతూ ఎన్డీయే ఎప్పటినుంచో ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు పోరాడుతోంది. ఇస్లామిక్ దేశాలు సైతం ట్రిపుల్ తలాక్ ను వ్యతిరేకిస్తున్న తరుణంలో లౌకిక దేశమైన భారత్ లో ఎందుకు రద్దు చేయలేమంటూ మోడీ సర్కారు ఈ బిల్లును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. గతంలో జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో కొత్త బిల్లును కేంద్ర ప్రభుత్వంత జూన్ 21న లోక్‌సభలో ప్రవేశపెట్టింది ది ముస్లిం వుమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజీ  బిల్లు, 2019 పేరుతో దాన్ని వ్యవహరిస్తున్నారు. ఎన్డీఏ వన్ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ బిల్లును లోక్‌సభలో పాస్ చేసుకొంది. కానీ, రాజ్యసభలో  ఆ బిల్లు పాస్ కాలేదు.ఈ బిల్లుకు పలు పార్టీలు సవరణలు కోరాయి.  అయితే బిల్లు రాజ్యసభలో పెండింగ్‌లో ఉంది. అదే సమయంలో ఈ ఏడాది మే 16వ లోక్‌సభ రద్దు అయింది. దీంతో ఈ బిల్లు కూడ రద్దు అయింది. ఈ కారణంగానే ట్రిపుల్ తలాక్ బిల్లును కేంద్రం మళ్లీ ప్రవేశపెట్టింది. ఈ బిల్లును పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి పంపాలని చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ బిల్లు వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని కాంగ్రెస్ అభిప్రాయపడింది. కనీసం ఐపిసి కింద శిక్ష వేసే క్లాజు నైనా తీసేయాలని కాంగ్రెస్ కోరింది. అయితే అధికార పార్టీ దానికి కూడా అంగీకరించలేదు. ముస్లిం మహిళలకు ఈ బిల్లు ద్వారా న్యాయం జరుగుతోందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ఎన్డీఏతో మిత్రపక్షంగా ఉన్న జేడీ(యూ) మాత్రం  ట్రిపుల్ తలాక్ పై తమ పార్టీ వెనక్కు తగ్గబోమని తేల్చిచెప్పింది. అయితే ఉభయసభల్లో ఈ బిల్లుకు అడ్డంకులు తొలగిపోవడంతో ఇకమీదట ట్రిపుల్ తలాక్ రద్దు కానుంది. ఉభయసభల ఆమోదం పొందిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం కూడా లభిస్తే దేశంలో ట్రిపుల్ తలాక్ చట్ట విరుద్ధం అవుంతుంది.  ఈ బిల్లు ఆమోదం పొందిన సంతోషంలో ఉన్న బిజెపి ఇక నుంచి అయినా పెద్ద సమస్యలపై చూపు సారించడం మంచిది.

Related posts

నేడు హ‌స్తిన ప‌ర్య‌ట‌నకు రేవంత్ రాహుల్‌తో భేటీ!

Sub Editor

గిరిజనుల్లో పౌష్టికాహారలోప నివారణకు పటిష్ట చర్యలు

Satyam NEWS

చిలకలూరిపేట లోని ఓగేరువాగులో గల్లంతయిన యువకుడు

Satyam NEWS

Leave a Comment