37.2 C
Hyderabad
March 29, 2024 17: 58 PM
Slider ముఖ్యంశాలు

ఉచితంగా మూడు స‌బ్జెక్ల్ ల‌ కు శిక్ష‌ణ‌….!త్రిశూల్ ర‌మ‌ణా స్కూల్ సంచ‌ల‌న నిర్ణ‌యం….!

ప్ర‌స్తుత ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో…పోటీ లేనిదే ఒక్క అంగుళం ముందుకు వెళ్ల‌లేం. ప్ర‌తీ రంగంలోనూ ప్ర‌తీ ఒక్క‌రికి ఆ పోటీ అవ‌స‌ర‌మే. మ‌రీ ముఖ్యంగా విద్యార్ధి ద‌శ‌లోనే ఆ పోటీ ఎంతో ప్రాముఖ్యాన్ని ఇస్తుంది. క‌రోనాకు ముందు విజ‌య‌న‌గ‌రం జిల్లాలో త్రిశూల్ ర‌మ‌ణా పబ్లిక్ స్కూల్ అంటే…”స‌రైనోడు” సినిమాలో హీరో అర్జున్ చెప్ప‌న‌ట్టు గా అదే బ్రాండ్.

జిల్లా కేంద్రంతో పాటు బొబ్బిలి,పార్వ‌తీపురంలో కూడా పెట్టి..నిష్టాతులైన టీచ‌ర్ల‌తో…విద్యార్ధుల‌కు ఐఐటీ,త్రిబుల్ ఐటీ కోచింగ్ లు ఇచ్చి మ‌రీ మంచి సంపాదించుకుంది.కాని అనుకోకుండా క‌రోనా రావ‌డంతో 2020,2021 లు ఆ రెండు సంవత్సాలు….విద్యా రంగంలో చిన్నా బిన్నం అయ్యింది. ఏకంగా ఒక ఏడాది కేంద్ర‌,రాష్ట్ర ప్ర‌భుత్వాలే…విద్యార్ధుల‌ను ప‌రీక్ష‌లు రాయ‌కుండానే పాస్ చేయించింది కూడ‌.ప్ర‌స్తుతం కోలుకున్నా…రెండేళ్ల క్రితం వ‌ర‌కు విద్యాసంస్థ‌ల‌లోనే మంచి పేరు గ‌డించిన త్రిశూల్ ర‌మ‌ణ స్కూల్…మ‌ళ్లీ పుంజుకునేందుకు చ‌ర్య‌లు చేపట్టింది.

అందులోభాగంగా విద్యార్దుల‌కు ఇంగ్లీషు, ఫిజిక్స్ మేథ్స్ ల‌లో ఉచితంగానే త‌ర్ఫీదు ఇచ్చేందుకు స‌న్న‌ద్ద‌మైంది.ఈ మేర‌కు త్రిశూల్ ర‌మ‌ణ స్కూల్ పౌండ‌ర్,డైర‌క్ట‌ర్,కుమార్ మాట్లాడుతూ… విజయనగర ప్రజలకు ముఖ్యంగా ఒకటి నుండి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు మరియు వారి తల్లి తండ్రులకు శుభవార్తని…ప్రతి విద్యార్దికీ . ఇంగ్లీష్ , మేథ్స్ ,ఫిజిక్స్ సబ్జక్ట్స్ లు ముఖ్య‌మ‌ని…
పాఠశాల స్థాయి నుండి ఐఐటీ స్థాయి వరకు ఆ స‌బ్జెక్టు లే పునాదిఅని . వీటిలో పరిపూర్ణులైతేనే విద్యార్జన చాలా అంటే చాలా సులభతరమవుతుంద‌ని…ఇందుకు త్రిశూల్ రమణా విద్యాసంస్థ‌.. ..మీకు సువర్ణ అవకాశం కల్పిస్తుందని..ఆ మూడు స‌బ్జెక్ట‌ల‌ను ప్ర‌తీ విద్యార్దికీ ఉచితంగా బోధిస్తామ‌ని చెప్పారు.

ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12.30 వరకు ఇంగ్లీష్ , గణితము , మరియు ఫిజిక్స్ ల‌లో నిష్ణాతులతో త‌ర‌గ‌తులు ఉంటాయ‌ని పేర్కొన్నారు. ప్ర‌త్యేకించి మహిళ‌ల‌కు అందునా అమ్మాయిల‌కు,స్త్రీల‌కు మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 వరకు ఉచితం గా స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు మరియు ప్రత్యేక అప్పాయింట్మెంట్ ద్వారా మీ పిల్లలకు కౌన్సిలింగ్ ఉంటుందని….ఈ అవకాశం వినియోగించుకోవాలి అనుకున్న వారు ముందుగా మీ పేర్లు నమోదు చేసుకోగలరు.

అందుకు ఈ . 9440435085, 7799888754, 84658 58867 ఈ నెంబ‌ర్ల‌ను సంప్ర‌దించ‌వ‌చ్చ‌న్నారు. అయితే బాల బాలకలకు హాస్టల్ వసతి కూడా ఉంటుంద‌ని తెలిపారు.

Related posts

చంద్రబాబు పర్యటనపై వైసీపీ కార్యకర్తల వినూత్న నిరసన

Bhavani

అసత్పూర్ భూములు సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇవ్వాలి

Bhavani

నెగ్లిజెన్స్: అకస్మాత్తుగా రాలిపోయిన గిరిజన బిడ్డ

Satyam NEWS

Leave a Comment