21.7 C
Hyderabad
November 9, 2024 05: 33 AM
Slider సంపాదకీయం

జూనియర్ ఎన్టీఆర్ పై నెటిజన్ల ట్రోలింగ్

#juniorntr

మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మాజీ మంత్రి కేటీఆర్ తో సంబంధాలపై మాట్లాడుతూ అక్కినేని నాగార్జున, అక్కినేని నాగచైతన్య అప్పటిలో ఆయన భార్య అయిన హీరోయిన్ సమం తలపై మంత్రి ఆరోపణలు చేశారు. దాంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోని చాలా మంది సమంతకు సపోర్ట్‌గా నిలబడింది.

ఇదంతా బాగానే ఉంది కానీ ఇదే విషయంపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్‌పై మాత్రం కొందరు నందమూరి అభిమానులు గరం గరం అవుతున్నారు. అందుకు కారణం ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని సంఘటనలే. మంత్రి కొండా సురేఖ వ్యక్తిగత జీవితాలను బయటకు లాగడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ అని జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు హుందాగా, గౌరవంగా గోప్యతను పాటించేలా వ్యవహరించాలని ఆయన హితవు పలికాడు. అయితే ఎన్టీఆర్ స్పందించినందుకు నెటిజన్లు బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు.

ఏపీలో గత ప్రభుత్వం జగన్ రెడ్డి హయాంలో చంద్రబాబు నాయుడిని, ఆయన భార్య భువనేశ్వరిని అవమానించినప్పుడు యావత్తు దేశం అంతా ఖండించింది. కానీ ఎన్టీఆర్ మాత్రం చాలా లౌక్యంగా మాట్లాడి స్పందించానంటే స్పందించాను అనేలా కామ్ అయ్యాడు. అప్పుడు అవమానించిన వారి పేర్లు తెలుసు, అధికారంలో ఉన్న వారెవరో కూడా తెలుసు. అంతే కాదు భువనేశ్వరిని అవమానించిన వారిని ఒక దశలో ప్రోత్సహించింది కూడా జూనియర్ ఎన్టీఆరే.  కానీ ఒక్కరి పేరు కూడా ప్రస్తావించకుండా చాలా లౌక్యంగా అప్పటిలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడాడు.

కానీ ఇప్పుడు సమంతను మంత్రి కొండా సురేఖ ఏమీ అనకపోయినా ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. అప్పటి మంత్రి కేటీఆర్ వత్తిడి తెస్తే సమంత నిరాకరించిందని మంత్రి చెప్పారు కానీ అప్పటిలో ఏపీ అసెంబ్లీలో మహిళలపై నేరుగా వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ఈ జూనియర్ ఎన్టీఆర్ పేలవంగా స్పందించారు. తనకు అత్త వరుస అయ్యే మహిళకు అవమానం జరిగితే నోరు మెదపలేని ఎన్టీఆర్ ఇప్పుడు సమంతను మంత్రి ఏమీ అనకపోయినా ఘాటుగా స్పందించాడు. ఇదే ఇప్పుడు నెటిజన్లకు ఆయుధంగా దొరికింది.

‘అప్పుడేమైంది నీ తెగువ.. వాళ్లు నీ స్నేహితులనేనా.. అంత సాఫ్ట్‌గా మాట్లాడావు.. ఇప్పుడేమో పరుధులు అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావ్’, ‘మేనమామ, మేనత్త అవసరం లేదు కానీ.. అక్కినేని ఫ్యామిలీకి కష్టం వస్తే మాత్రం అరక్షణం కూడా ఆగలేవా’, ‘ఇండస్ట్రీలోని వ్యక్తులు పవన్ కళ్యాణ్‌‌ని, ఆయన ఫ్యామిలీని ఇష్టం వచ్చినట్లు మాట్లాడినప్పుడు ఎందుకు రియాక్ట్ కాలేదు. ఆయన కూడా సినిమా వ్యక్తేగా.. అప్పుడేమైనాయ్ నీ పరిధులు’ అంటూ జూనియర్ ఎన్టీఆర్‌పై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు.

Related posts

జన నేత కడియం శ్రీహరి జన్మదిన వేడుకలు

Satyam NEWS

ములుగు జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఎన్నిక

Satyam NEWS

జమ్మిగడ్డ బస్తీలలో ప్రజల డాక్టర్ గా సంపత్ సేవలు అభినందనీయం

Satyam NEWS

Leave a Comment