కాగజ్ నగర్ పట్టణంలోని 13 వ వార్డు రిక్షా కాలనీ (అహ్మద్ రజా కాలనీ) కి చెందిన సయ్యద్ మహెపూజ్ ను టిఆర్ఎస్ పార్టీ 1 వ వార్డ్ నుంచి గెలుపొందిన సద్దాం హుస్సేన్ దాడిచేసి దారణంగా గాయపరిచారు. ఆయన అనుచరులు సయ్యద్ మహెపూజ్ ఇంట్లోకి చొరబడి విచక్షణ రహితంగా కొట్టారు. సయ్యద్ మహేపూజ్ భార్య అమీన్ బేగం ను పొత్తి కడుపులో తన్ని తీవ్రంగా గాయరిచారు.
అదే విధంగా సయ్యద్ మహెపూజ్ అక్క షకీల బేగం వేలుకు దెబ్బ తగిలి తీవ్ర రక్తస్రావం అవుతుంది. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలలో తనకు పనిచేయలేదని, తాను పెట్టిన అభ్యర్థికి వ్యతిరేకంగా పని చేశారని అందువల్ల మీ అందరి అంతూ చూస్తానని అతను బెదిరించాడు. మీ అందరి ఇండ్లను బుల్డో జర్ పెట్టి కూల గొడతానని బెదిరించాడు.
30 యాక్ట్ అమలులో ఉన్నా కూడా అహ్మద్ రజా కాలనీ లో టపాకాయలు పేల్చి ర్యాలీ తీసిన ఇతని పై, ఇతని అనుచరుల పై కఠిన చర్యలు తీసుకోవాలని SHOకి స్థానికులు వినతి పత్రం ఇచ్చారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో సిర్పూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి డా పాల్వాయి హరీష్ బాబు, నజీబ్ అహ్మద్, మహిపూజ్ కాలనీ వాసులు ఉన్నారు.