37.2 C
Hyderabad
March 29, 2024 17: 41 PM
Slider మెదక్

కేసీఆర్ నాయకత్వంలో తిరుగులేని శక్తిగా మారిన టీఆర్ఎస్

#ministerktr

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వంలో తెరాస పార్టీ తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఎదిగిందని రాష్ట్ర మంత్రి, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో గురువారం జరిగిన తెరాస పార్టీ ప్లీనరీ, విజయ గర్జన సభ ఏర్పాటు సమావేశం లో మెదక్, అందోల్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు దశాబ్దాలుగా కెసిఆర్ నాయకత్వంలో కార్యకర్తలు గులాబి జెండాను భుజాలపై మోస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు.

ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కరించే దిశగా కెసిఆర్ చేపడుతున్న అనేక ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలను పార్టీకి మరింత దగ్గర చేసిందన్నారు దేశంలో ఎక్కడలేని అనేక ప్రజా సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు దేశానికి మార్గదర్శకంగా నిలిచారన్నారు.

సమైక్యాంధ్రలో తెలంగాణకు నోరు, నీరు లేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజలకు గౌరవం దక్కిందన్నారు. ప్రజాదరణతో తెలంగాణలో తెరాస ఎదురులేని రాజకీయ శక్తిగా ఎదిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని  119 నియోజకవర్గాల్లో  105 మంది ఎమ్మెల్యేలు గెలుపొందడం గొప్ప విషయమన్నారు. 32 జిల్లా పరిషత్తులకు 32 గెలుపొందడం తెరాస పనితీరుకు నిదర్శనమన్నారు.

మెదక్ నియోజకవర్గంలోని145 గ్రామ పంచాయతీలు, రెండు మున్సిపాలిటీలలో 44 వార్డుల నుండి విజయగర్జనసభకు ప్రజలు, పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు ఆందోల్ నియోజకవర్గంలోని 200 గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలోని 23 వార్డుల నుండి ప్రజలు తరలి రావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రతి యూనిట్ నుండి వాహనాలపై సభకు రావాలన్నారు.

విజయ గర్జన సభకు బయలుదేరే ముందు వారి వారి గ్రామాలలో పార్టీ జెండాను ఆవిష్కరించి బయలుదేరాలన్నారు. ఈబయలుదేరాలన్నారు.ఈసమావేశంలో  మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ,యం.పి కొత్త ప్రభాకర్ రెడ్డి,సీఎం రాజకీయ కార్యదర్శి,ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి,మెదక్,ఆందోల్ శాసనసభ్యులు పద్మా దేవేందర్ రెడ్డి,చంటి క్రాంతి కిరణ్,రైతు సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షులు సోములు,ఎలక్షన్ రెడ్డి, జడ్పీటీసీలు,యంపీపీలు,పార్టీనాయకులు పాల్గొన్నారు.

Related posts

త్వరలో విజయ డెయిరీ విస్తరణ

Satyam NEWS

వైజ్ఞానిక ప్రదర్శనలు పిల్లల్లో నైపుణ్యాన్ని పెంచుతాయి

Murali Krishna

ఓ హెచ్.సిని ప్రశంసించిన విశాఖ రేంజ్ డీఐజీ!

Sub Editor

Leave a Comment