36.2 C
Hyderabad
April 25, 2024 20: 51 PM
Slider మహబూబ్ నగర్

జడ్జిమెంట్: హంగ్ మునిసిపాలిటీలన్నీ గులాబి కే

cm kcr

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో హంగ్ గా అవతరించిన అన్ని మున్సిపాలిటీలలోనూ టిఆర్ఎస్ పాగా వేసింది. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీలో ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచిన 10 మంది కౌన్సిలర్లు, టిఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్లు ప్రకటించారు. దాంతో ఐజ మున్సిపాలిటీలో టిఆర్ఎస్ పాగా వేసింది.

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గానికి చెందిన 11మంది కౌన్సిలర్లు టిఆర్ఎస్ లోనే ఉన్నట్లు వెల్లడించారు. దాంతో కొల్లాపూర్ మున్సిపాలిటీ పై టిఆర్ఎస్ జండా ఎగిరింది. వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో సిపిఎం కు చెందిన ఇద్దరు సభ్యులు, ఒక స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో అధికార పీఠం టిఆర్ఎస్ కైవసం చేసుకున్నది. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీలో బిజెపి నుంచి గెలిచిన నలుగురు కౌన్సిలర్లు టిఆర్ఎస్ లో చేరారు.

దాంతో చైర్మన్ గా బస్వరాజ్ గౌడ్.. వైస్ చైర్మన్ గా బిజెపి నుంచి గెలిచిన కెంద్యాల శ్రీనివాస్ ఎంపిక అయ్యారు. నారాయణపేట జిల్లా కోస్గి మునిసిపాలిటీ లో కాంగ్రెస్ 7… టి ఆర్ ఎస్ 7 కౌన్సిలర్ల గెలిచారు. స్వతంత్రులుగా గెలిచిన ఇద్దరు కౌన్సిలర్ లు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారు. కాగా ఎంపీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే లు అక్కడే తమ అధికారాన్ని ఉపయోగించుకున్న నేపథ్యంలో కోస్గి పీఠం టిఆర్ఎస్ కైవసం అయింది.

Related posts

లిబియాలో స్కూల్ పై దాడి: 30 మంది పిల్లల మృతి

Satyam NEWS

దివిసీమ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించిన నిమ్మగడ్డ

Satyam NEWS

కాంగ్రెస్ పార్టీకి ఇదే చివరి ఎన్నిక

Satyam NEWS

Leave a Comment