Slider హైదరాబాద్

పేకాడుతూ దొరికిపోయిన టీఆర్ఎస్ కార్పొరేటర్

#TRS Corporater

అసలే లాక్ డౌన్ సమయం. విపరీతంగా ఖాళీ సమయం ఉంది ఏం చేయాలి అనుకున్నాడు ఆ కార్పొరేటర్. డబ్బులు పెట్టి పేకాడుతున్నాడు. ఎస్ ఓ టీ పోలీసులు రైడ్ చేయగానే అడ్డంగా బుక్కయిపోయాడు పాపం. హైదరాబాద్ లోని మౌలాలి లోని ఒక పేకాట క్లబ్ లో పెద్ద ఎత్తున బెట్టింగులతో పేకాట ఆడుతున్నారని సమాచారం అందడంతో మల్కాజ్ గిరి ఎస్ ఓటి పోలీసులు రైడ్ చేశారు.

అక్కడ టీఆర్ఎస్ పార్టీకి చెందిన జవహర్ నగర్ కార్పొరేటర్ బిలిగౌలికర్  శివాజీ పేకాడుతూ దొరికిపోయాడు. అతనితో పాటు శిలా సాగర కిరణ్ గౌడ్, కొచానా రాజు, పాలనటి రమేష్, గంన్నం  రాజేష్ కన్నా నాయుడు, అలపురం  భాస్కర్ రెడ్డి, పోల్ రాజు కూడా దొరికారు.

వీరి వద్ద నుండి ఒక లక్ష ఇరవై ఒక్క వెయ్యి 520 రూపాయలతో పాటు ఏడు సెల్ ఫోన్లు14 ప్లేయింగ్ కార్డుల సెట్లు సెట్ లతో పాటు వాహనాలు స్వాధీనం వీరిని మల్కాజిగిరి పోలీసులు కోర్టుకు తరలించగా  14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించగా చర్లపల్లి జైలుకు తరలించారు.

Related posts

బాధితులకు అండగా నిలవండి

mamatha

పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందించిన డీజీపీ

Satyam NEWS

యాదవులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గొఱ్ఱెలు పంపిణీ చేయాలి

Satyam NEWS

Leave a Comment