28.2 C
Hyderabad
June 14, 2025 11: 00 AM
Slider రంగారెడ్డి

వచ్చే ఎన్నికల్లో కారు తుక్కు తుక్కు కావడం ఖాయం

#Uppala

వచ్చే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలలో కమలం పువ్వు రెక్కలు ఊడిపోతాయని , అంబాసిడర్ కారు మూడు పల్టీలు కొట్టి తుక్కుతుక్కు అవుతుందని తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వెంకటేష్  భవిష్యం చెప్పారు.

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో  విలేకర్ల సమావేశంలో ఉప్పల వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కరోనాతో  మృతి చెందిన కుటుంబాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ విపత్తు కింద చేరో 5 లక్షల రూపాయల చొప్పున కరోనా మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత బలహీన పరిపాలన వలన తెలంగాణలో కరోనా మహమ్మారి వల్ల వేలాది మంది ప్రజల ప్రాణాలు పోయాయని వారి కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయి రోడ్డున పడ్డారని తెలిపారు.

ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వాలు వారికి ఆర్థికంగా సహాయం అందించి మనోధైర్యాన్ని ఇచ్చి చేదోడువాదోడుగా ఉండాలని రాజనీతిని, రాజ ధర్మాన్ని నిర్వర్తించాలని ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసం ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేయాలని నిర్లక్ష్యం వహిస్తే ప్రజల వచ్చే ఎన్నికలలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.

వచ్చే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి పార్టీ కమలం పువ్వు రెక్కలు ఊడిపోతాయని, టిఆర్ఎస్ పార్టీ యొక్క అంబాసిడర్ కారు మూడు పల్టీలు కొట్టి తుక్కు తుక్కు అవుతుందని హెచ్చరిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కరోనా మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Related posts

మంత్రి పెద్దిరెడ్డికి దమ్ముంటే కుప్పలో పోటీచేయాలి

Satyam NEWS

Over The Counter Siddha Medicines For Diabetes In Chennai Cures For Diabetes 2022

mamatha

డి రైల్డ్:ఒడిశాలో పట్టాలు తప్పిన ఎల్టీటీ ఎక్స్ ప్రెస్

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!