Slider తెలంగాణ

డబ్బులు పంచుతున్న టిఆర్ఎస్ అభ్యర్థి సోదరుడు

cash for vote

మునిసిపల్ ఎన్నికలలో ఓట్లు కొనుగోలు చేయడంలో టీఆర్ఎస్ నాయకులు ముందు వరుసలో ఉన్నారు. తాజాగా పెద్దపల్లి పురపాలికలోని 2వ వార్డు టిఆర్ఎస్ అభ్యర్థి హనుమంతు సోదరుడు ఓటర్లకు నగదు పంపిణీ చేశాడు. అతను డబ్బు పంపిణీ చేస్తున్న దృశ్యాన్ని అనుచరులే వీడియో తీసి సోషల్ మీడియాకు అందివ్వడం ఇక్కడ గమనార్హం.

కారు గుర్తుకు ఓటు వేయాలంటూ టిఆర్ఎస్ అభ్యర్థి సోదరుడు ఓటర్లకు డబ్బు పంచాడు. పైగా వేరే పార్టీ వారిని ఓట్లు అడగడానికి కూడా రానివ్వవద్దని ఓటర్లకు చెప్పాడు. ఈ వార్తతో బాటు వీడియో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తున్నది.

Related posts

సీనియర్ గ్రామీణ విలేకరి మల్యాలకు సన్మానం

Satyam NEWS

భత్యాల జన్మదిన వేడుకలు…మినీ మహానాడు సంబరాలు…

Satyam NEWS

విజిబుల్ పోలీసింగ్ తోనే నేరాల నియంత్రణ

Satyam NEWS

Leave a Comment