28.7 C
Hyderabad
April 20, 2024 10: 09 AM
Slider ముఖ్యంశాలు

గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల ప్రచారంలో పోచారం భాస్కర్ రెడ్డి

#Pocharam Bhaskarreddy

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో ప్రచారానికి వచ్చిన ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కి  స్థానిక కాలని మహిళలు హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు.

131వ డివిజన్ లోని సంజీవయ్య నగర్ , రామకృష్ణ నగర్ లో అభ్యర్థి  కూన పారిజాత గౌరీష్ కు మద్దతుగా నేడు ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ రైతులకోసం, ప్రజలకోసం ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నారని తెలిపారు.

తెరాస ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే వివేక్  131వ డివిజన్నీ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అర్హులైన  వారందరికీ నేడు పెన్షన్ అందుతుంది అంటే కేవలం మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  కృషి వల్లే అన్నారు.

పెన్షన్ ఒక్కటే కాదు, కేసీఆర్  రైతు కాబట్టే, రైతులు అప్పులు చేసి బాధపడుతుంటే చూడలేక వారి కోసం రైతు బంధు పథకం తెచ్చి రాష్ట్రంలోని రైతులందరికీ పంటకు 5000రూపాలు తో సంవత్సరానికి 10,000 రూపాయిలు ఇస్తున్నారని గుర్తు చేశారు.

అనుకోని పరుస్థితుల్లో రైతు మరణిస్తే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల భీమా  వారం రోజుల లోపలే వారి అకౌంట్లలో పడుతున్నాయి. దేశంలో ఎక్కడా కూడా రైతులకోసం ఈ పథకాలు లేవని నేడు రాష్ట్రం లో ఇల్లు లేని పేద వారు ఉండకూడదు అని హార్లులైన వారందరికి 2పడక ఇండ్లను ఇస్తున్న ఏకైక సీఎం మన రాష్ట్ర సీఎం అని గుర్తు చేశారు.

అడపడచుల కోసం మరో శుభవార్త చెప్పిండు. డిసెంబర్ 1 నుండి మంచి నీటి బిల్లు ఇక కట్టనవసరం లేదు అని తెలియజేసారు. తెలంగాణ రాష్ట్రానికి నేడు అన్ని సంక్షేమ పథకాలను అందిస్తు, అన్ని రంగాల వారికి అదుకుంటున్న ఏకైక సీఎం మన కేసీఆర్ అని పునరుద్ఘాటించారు.

హైదరాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్న వ్యక్తి పురపాలక శాఖ మంత్రి  కెటి రామారావు  అని తెలియజేసారు. ఎన్నో ఐటి కంపెనీలను మన హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టేలా వారికి ఆకర్షిత రాయితిలను కల్పిస్తూ నేడు వేలాది యువతకు ఉపాధి కల్పిస్తున్నారని గుర్తు చేశారు.

మళ్ళీ తెరాస పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి అభ్యర్థిని శ్రీమతి పారిజాత గౌరీష్ లను బారి మెజారిటీ తో గెల్పించుకొని డివిజన్ ను మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని ప్రజలను కోరారు.

Related posts

గుర్రం ఎక్కిన బాలయ్య

Satyam NEWS

నేటి నుంచే రైతు బంధు 61.49 ల‌క్ష‌ల మంది రైతుల‌కు ప్ర‌యోజ‌నం

Sub Editor

పెట్టుబడి-పదవి-సంపాద: ఇదేనా రాజకీయం?

Satyam NEWS

Leave a Comment