22.7 C
Hyderabad
July 15, 2024 01: 24 AM
Slider నిజామాబాద్

నిజాంసాగర్ సింగితం రిజర్వాయర్లలో రొయ్య పిల్లల విడుదల

hanmanth shinde

కామారెడ్డి జిల్లా  నిజాంసాగర్  మండలంలోని సింగితం నిజాంసాగర్  రిజర్వాయర్లలో సమీకృత మత్స్య అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ సిండే కామారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదర్ శోభారాజు  రొయ్యలను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శాసనసభ్యులు మాట్లాడుతూ మత్స్యకార కుటుంబాలకు ఆదుకునేందుకు వంద శాతం రాయితీతో చేపలను రొయ్యలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందన్నారు. గతంలో చేపలను పంపిణీ చేశామని నేడు రొయ్యలను కూడా పంపిణీ చేస్తున్నామన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు వారి సంక్షేమాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే  జడ్పీ చైర్మన్ తో పాటు మత్స్యశాఖ అధికారులు మత్స్యకార కుటుంబ సభ్యులు మండల తెరాస నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Related posts

పోక్సో కేసులపై దృష్టి పెట్టండి…!

Satyam NEWS

పెళ్లి జరుగుతుండగానే పెళ్లి కూతురి మృతి

Satyam NEWS

ప్రవేశ పరీక్ష ల షెడ్యూల్ విడుదల

Satyam NEWS

Leave a Comment