Slider తెలంగాణ

నర్సంపేటలో టిఆర్ ఎస్ నాయకుడిపై కత్తులతో దాడి

warangal attack

భూ వివాదం కారణంగా వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో దారుణం జరిగింది. వరంగల్ రోడ్డులో మార్నింగ్ వాక్ చేస్తున్న దంపతులపై దాడి జరిగింది. అంబటి వెంకన్న అనే టిఆర్ ఎస్ నాయకుడు, అతని భార్య నడుచుకుంటూ వెళుతుండగా. ఒక్కసారిగా వచ్చిన దుండగులు మొదట వారి కళ్లలో కారం కొట్టారు. తర్వాత తలపై రాడ్డుతో దాడి చేశారు. వెంకన్నను కత్తులతో పొడిచి పారిపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వెంకన్నను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వెంకన్నకు.. కుమ్మరికుంటలో ఉన్న దాదాపు 3 కోట్ల విలువ చేసే భూమిపై కొందరితో వివాదం ఉన్నట్లు తెలుస్తోంది. కొంత కాలంగా ఇరువర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వెంకన్న దంపతులపై దాడి చేసిన దుండగులు నర్సంపేట పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు.

Related posts

దారితప్పిన బాలుడిని దరికి చేర్చిన విలేకరికి సన్మానం

Satyam NEWS

పట్టిసీమ ను విమర్శించిన వారే వాడుతున్నారు…

Bhavani

ఉత్కంఠభరిత సన్నివేశాల చిత్రీకరణలో విజయ్ సేతుపతి ‘విడుతలై’

Satyam NEWS

Leave a Comment