27.7 C
Hyderabad
April 20, 2024 02: 52 AM
Slider హైదరాబాద్

క్రిస్టియన్ పేదలకు నిత్యావసరాలు పంచిన టీఆర్ఎస్ నేతలు

#TRSAmberpet

లాక్ డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు యాసీన్ షరీఫ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులను పంపిణి చేశారు. హైదరాబాద్ లోని అంబర్ పట్ పరిధిలో ఉన్న 6 చర్చిలకు వీటిని అందచేశారు.

బేతనియ చర్చిలో జరిగిన ఈ కార్యక్రమంలో అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా పని చేస్తున్న  యాసిన్ షరీఫ్ ను అభినందించారు. రేషన్ కార్డు లేని ప్రతి ఒక్కరూ ఎమ్మార్వో ఆఫీస్ కి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు.

రేషన్ కార్డు లేని ప్రతి పేద వారికి  ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు అందరికీ వర్తిస్తుందని ఆయన అన్నారు. టిఆర్ఎస్ సీనియర్ నాయకులు   యాసిన్ షరీఫ్ మాట్లాడుతూ ఇది తన వంతు సాయం మాత్రమే ప్రతి ఒక్కరిని  ఆదుకుంటానని ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటూ కరోనాను తరిమికొట్టి విజయాన్ని సాధించాలని అన్నారు 

ఈ కార్యక్రమంలో SAR/CPL Commandant రవికుమార్, ఆర్ ఐ వీరు నాయక్, కరుణాకర్, జోసెఫ్, విజయ రావు, జయరాజు తదితరులు పాల్గొన్నారు. ఇంకా అంబర్ పేట్ నియోజకవర్గం క్రిస్టియన్ మైనారిటీల సంఘం అధ్యక్షుడు రాజు మదాని, పాస్టర్లు జాన్ పీటర్, చంద్రమోహన్, జాషువా, రుతమ్మ, టీఆర్ఎస్ సీనియర్ లీడర్ లవంగ ఆంజనీయులు, బి వి రమణ, విష్ణు, అహ్మద్, రాజేష్, ఖలీల్ కూడా పాల్గొన్నారు.

Related posts

గిద్దలూరు లో పసికందును వదిలేసి వెళ్లిన తల్లి

Bhavani

అరసవల్లి పెద్దాయన..అయిన వారి కోసం పోలీసుల చూపు…!

Satyam NEWS

ఏపీ రాజధాని గ్రామాల్లో ఉద్ధృతంగా ఆందోళన

Satyam NEWS

Leave a Comment