39.2 C
Hyderabad
April 25, 2024 18: 32 PM
Slider వరంగల్

మాయ‌మాట‌ల బీజేపీకి బుద్ధి చెప్పాలి

bjp

దుబ్బాకలో మాయమాటలతో గెలిచిన బిజెపి నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారని, ఈ విధానం సరైంది కాదని, ఆ మాటలు మానుకోవాలని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్లు హెచ్చరించారు. రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలపై హన్మకొండ ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ లో ఎంపీ పసునూరి దయాకర్ రావు, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్, పెద్ద సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్, ఇతర స్థానిక నేతలతో కలిసి సమీక్షించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… హైదరాబాద్ లో వంద సంవత్సరాల తర్వాత భారీ వర్షం వచ్చి లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతే ప్రభుత్వం ముందుకు వచ్చి రోడ్డున పడ్డ కుటుంబాలను ఆదుకునేందుకు 10వేల రూపాయలు ఇస్తే, దానిని కూడా ఈ ప్రభుత్వం లబ్ది పొందేందుకు చేసిందన్నబిజేపి నేతల విమర్శలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. మొన్నదుబ్బాకలో మాయమాటలు చెప్పి గెలిచి, రాష్ట్ర ప్రభుత్వంపై చాలా ఎక్కువ మాట్లాడుతున్నార‌ని ఇది సరైంది కాదన్నారు.

రాష్ట్రం నుంచి కేంద్రంలో ఉండేందుకు ప్రజలు అవకాశం ఇస్తే వాటి ద్వారా రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలని ఆలోచించకపోవడం దురదృష్టకరమన్నారు. ఇంత పెద్ద విపత్తు వస్తే ఒక్క రూపాయి కూడా తీసుకురాకపోగా, కేంద్రం తీసుకున్న చర్యలు డిమానిటైజేషన్, జీఎస్టీ, కరోనా వంటి వాటితో రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికంగా ఇబ్బంది పడాల్సి వచ్చిందన్నారు. ప్రజలకు మద్దతుగా నిలవాల్సిన వారు ప్రజల మీద భారం మోపే విధంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

కొంతమంది వ్యాపారుల చేతుల్లో ఈ దేశాన్ని పెట్టాలని బిజెపి ప్రభుత్వం ఆలోచిస్తుందని, రానున్నఎన్నికల్లో దీనిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని ప్రజలను కోరారు. దొడ్డు బియ్యం తినడం లేదని, సన్నబియ్యానికి డిమాండ్ ఎక్కువగా ఉందని, సన్నాలు పండిస్తే రైతుకు లాభం జరుగుతుందని, సిఎం కేసిఆర్ పిలుపునిస్తే కేంద్రం రైతులపై కక్షకట్టినట్టు వ్యవహరిస్తోందన్నారు. సన్నాలకు మద్దతు ధర ఎక్కువ ఇచ్చే విధంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తామని సిఎం కేసిఆర్ రైతులకు చెబితే, తెలంగాణ రైతులు నష్టపోతే మాకు సంబంధం లేదు. మద్దతు ధర ఎక్కువ ఇస్తే, ఇక్కడి ధాన్యం కూడా తీసుకోమని కేంద్రం బెదిరించడం బిజెపి రైతు వ్యతిరేక విధానానికి నిదర్శనమన్నారు. ఇక్కడి రైతులకు సన్నాలకు మద్దతు ధర ఎక్కువ మేము ఇస్తామన్నాకూడా ఇవ్వకూడదన్న విధంగా కేంద్రం లేఖ ఇచ్చిన విషయాన్ని ఇటీవల సిఎం కేసిఆర్ బహిర్గతం చేసింది ప్రజలు గుర్తు పెట్టుకోవాలన్నారు.

ఇక్కడి ప్రజలకు ఉపయోగపడే విధంగా కేంద్రాన్ని ఒప్పించలేని ఈ రాష్ట్ర బీజేపీ నేతలు నిత్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, వీరికి రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని కోరారు.

Related posts

భిక్షాటన డబ్బులు తీసుకోండి.. మా భూములు ఇచ్చేయండి

Satyam NEWS

శ్రీశైలం లో  ఆర్య వైశ్యుల నిత్యాన్నదాన సత్రం పాక్షికంగా కూల్చివేత 

Satyam NEWS

కరోనా కట్టడిలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యం

Satyam NEWS

Leave a Comment