28.2 C
Hyderabad
April 20, 2024 14: 22 PM
Slider నల్గొండ

కార్మికులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి

#CPI Hujurnagar

మధ్యాహ్నభోజన ఏజెన్సీ కార్మికులు, వలస కూలీలుగా అడ్డా కూలీలుగా మారి బతుకు పోరాటం చేస్తుంటే వారిని ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షులు శీతల రోషపతి ఆరోపించారు. హుజూర్ నగర్ లోని సీఐటుయు కార్యాలయంలో  మండల కమిటీ సమావేశంలో పాల్గొని రోషపతి మాట్లాడుతూ 2019 నవంబర్ నుండి 2020 మార్చి వరకు ఐదు నెలల జీతాలతో పాటు పెండింగ్ బిల్లులు తక్షణమే ఇవ్వాలని కోరారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తీపి కబురు రైతులతో పాటు పేద ప్రజలు కార్మికవర్గానికి కూడా చెప్పాలని ప్రతి ఒక్క కార్మికుడికి 7500 రూపాయలు చొప్పున 3 నెలలు ఇవ్వాలని ఈ మూడు నెలలు కరెంట్ బిల్లు కూడా రద్దు చేయాలని కోరారు.

సిఐటియు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మునగాల మండలం కలకోవ గ్రామం లో సిఐటియు దిమ్మెను కూల్చిన  దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కట్ చేయకుండా పూర్తి వేతనం ఇవ్వాలని, ఈ కరోనా టైంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్న మున్సిపల్ గ్రామపంచాయతీ కాంట్రాక్ట్ కార్మికులు, ఆశాలని పర్మినెంట్ చేయాలని కోరారు.

మధ్యాహ్నభోజన ఏజెన్సీ కార్మికులు పెండింగ్ బిల్లులు బకాయి వేతనాలు విడుదల చేసి వారిని ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎలక సోమయ్య గౌడ్, చింతకాయల పర్వతాలు, మధ్యాహ్న భోజనం మండల అధ్యక్ష కార్యదర్శి రాళ్ళబండి మంగమ్మ,  కోటేశ్వరి, లక్ష్మమ్మ, కోటమ్మ,వీరమ్మ, మంగమ్మ, కళ్యాణి, వెంకటరమణ, చిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు.

Related posts

డైవర్షన్: అమ్మఒడి పథకం కోసం దళితులకు శఠగోపం

Satyam NEWS

రాష్ట్రం అద్భుత ప్రగతిని సాధిస్తుంది.

Murali Krishna

చదువుల తల్లికి క్లాస్ మెట్ క్లబ్ ఆసరా

Satyam NEWS

Leave a Comment