32.2 C
Hyderabad
April 20, 2024 18: 58 PM
Slider వరంగల్

ములుగులో చురుకుగా టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు

#TRSMulugu

ములుగు నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభం అయింది.

ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ అధ్యక్షతన జరుగుతున్న నియోజకవర్గ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి జలవనరుల రాష్ట్ర చైర్మన్ విరమల్ల ప్రకాష్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి  హాజరయ్యారు. టిఆర్ఎస్ పార్టీ ప్రతి రెండేళ్లకు ఒకసారి సభ్యత్వ నమోదు చేపడుతుంది.

ఈ సారి ఈ నెల 12వ తేదీ నుంచి సభ్యత్వ నమోదు ప్రారంభించి ఈ నెల 27 వరకు చేయనుంది. రాష్ట్రంలో 60 లక్షల మంది సభ్యులున్న అతిపెద్ద పార్టీ టిఆర్ఎస్. ఈ నియోజక వర్గంలో సభ్యత్వ నమోదు గతంలో రాష్ట్రంలో మొదటి మూడు స్థానాలలో ఉన్నామని ఈ సందర్భంగా ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ తెలిపారు.

టిఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తి. కార్యకర్తల సంక్షేమం కోసం బీమా పెట్టి ఆలోచించిన ఏకైక పార్టీ టిఆర్ఎస్. సభ్యత్వ నమోదులో పార్టీ నేతలంతా చురుకుగా పాల్గొనాలి అని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఒడిసీఎంఎస్ వైస్ చైర్మన్ కేసిడి శ్రీనివాస్ రెడ్డి, రైతు బంధు జిల్లా అధ్యక్షులు పల్లా బుచ్చయ్య, మేడారం ట్రస్టు బోర్డు చైర్మన్ అలం రామూర్తి, జడ్పీటీసీ లు సకినాల భవాని,గై రుద్రమదేవి అశోక్,తుమ్మల హరిబాబు,జడ్పీ కోప్షన్ వాలియాబీ, ఎంపీపీలు గండ్రకోట శ్రీదేవి సుధీర్,సుడి శ్రీనివాస్ రెడ్డి,గొంది వాణి శ్రీ,బుర్ర రజిత సమ్మయ్య,

రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నిక కో ఆడినేటర్ పోరిక గోవింద్ నాయక్, కాకుల మర్రి లక్ష్మణ్ రావు,పార్టీ మండల అధ్యక్షులు బాదం ప్రవీణ్,కూరేళ్ల రమాచారి,మురహరి భిక్షపతి, గడదాసు సునీల్ కుమార్,బండారి చంద్రయ్య, కుడుముల లక్ష్మీ నారాయణ,సుబ్బుల సమ్మయ్య,కొమ్మరబోయిన వేణు,

ఈసం సమ్మయ్య,డీసీసీబీ డైరెక్టర్ లు మాడుగుల రమేష్,బెల్లి గోపాల్ రావు,ఎంపీటీసీ ల ఫోరమ్ అధ్యక్షులు పోరిక విజయ్,సర్పంచ్ ఫోరమ్ జిల్లా.అధ్యక్షులు చందంకుమార్,పిఏసీఎస్ ఛైర్మెన్ల్, ఆత్మ ఛైర్మెన్ల్,మైనార్టీ నాయకులు తాహిర్ పాషా, నియోజకవర్గ అన్ని మండలాల అధికార ప్రతినిధి లు,రైతు బంధు కో ఆడినేటర్లు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

కె.మహేందర్, సత్యం న్యూస్

Related posts

‘నాకు మాత్రం న్యాయం గెలవడమే ఇంపార్టెంట్‌’ అంటున్న ‘తిమ్మరుసు’

Satyam NEWS

అరుదైన ఈ జాతి ముత్యాన్ని కాపాడుకుందాం

Satyam NEWS

వర్షాలతో రైతులకు ఇబ్బంది రాకుండా చర్యలు

Satyam NEWS

Leave a Comment