27.7 C
Hyderabad
March 29, 2024 02: 12 AM
Slider ప్రత్యేకం

నార్ముల్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయభేరీ

#Telangana CM KCR

నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తి దారుల పరస్పర సహాయక సహకార యూనియన్ లిమిటెడ్ లో నాలుగు డైరెక్టర్లకు జరిగిన ఎన్నికల్లో అధికార టి ఆర్ యస్ పార్టీ విజయభేరీ మ్రోగించింది. రాజీ ఫార్ములా తో విపక్ష కాంగ్రెస్ పార్టీ జరిపిన బేరసారాలను త్రిప్పి కొట్టడంతో పాటు రెండు మహిళా డైరెక్టర్లను ఏకగ్రీవంగా ఎన్నిక కాగా నాలుగు డైరెక్టర్ పదవులకు ఎన్నికలకు పోవడం ద్వారా విపక్ష కాంగ్రెస్ కు చెక్ పెట్టినట్లైంది.

జిల్లాలోని 11 మంది శాసనసభ్యులు,రాజ్యసభ సభ్యులు, టెస్కాబ్ వైస్ ఛైర్మన్ లతో పాటు ఇప్పటి వరకు నార్ముల్ చైర్మన్ గా వ్యవహరించిన గుత్తా జితేందర్ రెడ్డి లతో సమన్వయం చేసుకున్న జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో గెలుపు సునాయాసం కావడంతో పాటు విపక్షాల నుండి భారీగా ఓట్లు క్రాస్ కావడంతో టి ఆర్ యస్ ఖాతాలో అత్యధికంగా 255 ఓట్లు పడ్డాయి.

మొత్తం 306 ఓట్లకు గాను మూడు సొసైటీ లకు ఎన్నికలు జరగక పోవడంతో ఈ రోజు జరిగిన ఎన్నికల్లో మొత్తం 303 ఓట్లు పొలయినాయి.అందులో అధికార టి ఆర్ యస్ పార్టీకి ఉన్న సభ్యులు@ఓటర్లు 217 గా గుర్తించారు.అయితే ఓట్ల లెక్కింపు అనంతరం ఆ పార్టీ నుండి పోటీ చేసిన గూడూరు శ్రీధర్ రెడ్డికి 255,కోట్ల జలందర్ రెడ్డి కి 243,చల్లా సురేందర్ రెడ్డికి 232,రచ్చలక్ష్మినరసింహా రెడ్డికి 219 ఓట్లు పొలు కావడంతో విపక్ష పార్టీల నుండి భారీగా క్రాసింగ్ జరిగిందనేది స్పష్టంగా కనిపిస్తోంది.

ఎన్నికలకు ముందు అధికార టి ఆర్ యస్ పార్టీ దగ్గర ఉన్న లెక్కల ప్రకారం టి ఆర్ యస్ పార్టీకీ 217 సొసైటీలు విపక్ష కాంగ్రెస్ కు 61,బిజెపి కి 4,సి పి ఐ కి 9,సి పి యం కు 8 స్వతంత్ర అభ్యర్ధులు నాలుగు సొసైటీలో ఉన్నట్లు గుర్తించారు.ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం అనూహ్యంగా టి ఆర్ యస్ పార్టీ ఖాతాలో 255 ఓట్లు చేరడంతో ఎన్నికల ద్వారా విపక్ష కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టినట్లైందని టి ఆర్ యస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Related posts

హుజురాబాద్ లో పూర్తి కావచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు

Satyam NEWS

సన్ టి విని దాటిన స్టార్ మా ఇప్పుడు నెంబర్ వన్

Satyam NEWS

తెలంగాణ ప్రజలను మోసం చేసిన సీఎం కేసీఆర్

Satyam NEWS

Leave a Comment