24.7 C
Hyderabad
March 26, 2025 10: 24 AM
Slider నిజామాబాద్

విపత్కర సమయంలో కూడా వికృత రాజకీయం

#BJP Armoor

కరోనా విపత్కర సమయంలో కూడా టిఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేస్తున్నదని భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ పొద్దుటూరు వినయ్ రెడ్డి అన్నారు. ఎంపీటీసీ, జెడ్ పి టి సి, కార్పొరేటర్ లను డబ్బులకు లొంగ తీసుకొని పార్టీలో జాయిన్ చేసుకోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు.

బీజేపీ నుంచి గెలిచి టీఆర్ఎస్ లో చేరిన జడ్పిటిసి, ఎంపీటీసీలు, కార్పొరేటర్లను దమ్ముంటే వెంటనే రాజీనామా చేసి మళ్ళీ  గెలిపించండి చూద్దాం అని ఆయన సవాల్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ 20 లక్షల కోట్ల ప్యాకేజీని  అందరి కోసం ప్రకటిస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

డబుల్ బెడ్ రూమ్ లు, భగీరథ నల్ల నీళ్లు, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వడంలో ఫెయిల్ అయిన కేసీఆర్ ప్రధానిని విమర్శించడం విడ్డూరమని ఆయన అన్నారు.

ఈ సమావేశంలో పుప్పాల శివరాజ్,నుతుల శ్రీనివాస్,జెస్సు అనిల్,రోహిత్ రెడ్డి,ఆకుల రాజు,కౌన్సిలర్లు నరసింహ రెడ్డి,పాలెపు రాజు,ఆకుల శ్రీనివాస్,మురళి,సాయి, ఎం పి టి సి లు బాల నర్సయ్య,నవీన్,ముకేశ్,సీను,రాజ్ కుమార్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

జర్నలిస్టు కంటి చికిత్సకు దారపనేని సాయం

Satyam NEWS

హుజూర్ నగర్ వాసి తండు హరికృష్ణ గౌడ్ కు డాక్టరేట్ పురస్కారం

Satyam NEWS

ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చూడండి

Satyam NEWS

Leave a Comment