33.2 C
Hyderabad
April 26, 2024 01: 29 AM
Slider కరీంనగర్

బీజేపీ రైతు వ్యతిరేక చర్యలపై పోరాటానికి టీఆర్ఎస్ సన్నద్ధం

#gangula

కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు, తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు పై బీజేపీ నేతల అడ్డగోలు వాదనలకు నిరసనగా శుక్రవారం తలపెట్టిన ధర్నా ఏర్పాట్లని మంత్రి గంగుల కమలాకర్ సమీక్షించారు. ఈరోజు కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులతో పట్టణంలో సమావేశం ఏర్పాటు చేసారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టే ఆందోళనల్లో పార్టీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొనాలని, వారిని సమన్వయపరుచుకొనే బాధ్యతలు నాయకులు చేపట్టాలని సూచించారు. రాజ్యాంగం ప్రకారం ప్రతీ గింజను కొనే బాధ్యత గల కేంద్రం దాని నుంచి తప్పించుకుంటున్న తీరును రైతులకు సమగ్రంగా వివరించాలన్నారు. వ్యవసాయ మార్కెట్లను ప్రైవేటుకు దోచిపెట్టే కుట్రల్ని చేస్తూ దొంగే దొంగ అన్నట్టుగా బీజేపీ అనుసరిస్తున్న వైఖరిని ప్రజల్లో ఎండగట్టాలన్నారు, తెలంగాణ రైతాంగానికి కించిత్ సహాయం చేయకపోగా, రాష్ట్ర ప్రభుత్వ రైతు అనుకూల విధానాలు, రైతుబందు, 24గంటల ఉచిత కరెంటు, కాళేశ్వర జలాలతో ఇప్పుడిప్పుడే తెరిపిన పడుతున్న రైతును గందరగోళంలో పడేసేలా బీజేపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా శుక్రవారం ధర్నాలు నిర్వహించాలని సూచించారు మంత్రి గంగుల. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రసమయి భాలకిషన్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ నారదాసులక్ష్మణ్ రావు, టీఆర్ఎస్ సీనియర్ నేత పెద్దిరెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.

Related posts

మణిపూర్ ఘటనపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోండి

Bhavani

వేతనాలు పెంపు కోసం ఏప్రిల్ 5న సమగ్ర శిక్ష సదస్సు

Satyam NEWS

సిర్పూర్ కాగజ్ నగర్ లో బిజెపి ప్రతిష్టను మరింత పెంచుతా

Satyam NEWS

Leave a Comment