30.7 C
Hyderabad
April 19, 2024 10: 33 AM
Slider వరంగల్

ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలో డోర్నకల్ నియోజకవర్గంలోని గ్రాడ్యుయేట్ లను తెరాస పార్టీ సభ్యత్వంతో ఆహ్వానం పలకాలని నియోజకవర్గ ఎమ్మేల్యే రెడ్యానాయక్ అన్నారు. శనివారం మరిపెడ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశ నిర్దేశం చేసారు. నియోజకవర్గం ఇప్పటికే 5 వేల మంది గ్రాడ్యుయేట్ తెరాస సభ్యత్వం పోంది ఉన్నారని వివరించారు.

2017 అంతకంటే ముందు ఏదయినా డిగ్రీ, ఇంజినీరింగ్, డిగ్రీ సమానమైన డిప్లొమా ఆపై చదువులు చదివి ఉత్తీర్ణత పొందిన గ్రాడ్యుయేట్ సోదరులు గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకోనేందుకు అర్హులని వివరించారు. త్వరలో జరిగే ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గ ఓటు హక్కు పొందాలని సూచించారు. ఓటు హక్కు పొందుటకు డిగ్రీ ప్రొవిషనల్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు,ఓటర్ గుర్తింపు కార్డ్ జిరాక్స్ తో పాటు 2 ఫోటోలు, మొబైల్ నంబర్ తో సహ పూర్తి చేసిన ఫార్మ్-18 ను ఎమ్మార్వో ఆఫీసులో అందజేయాలన్నారు.

మున్సిపల్ పరిధిలోని ప్రతి కౌన్సిలర్, కో–ఆప్షన్ సభ్యులు మరో గ్రాడ్యుయేట్స్ ను తెరాస సభ్యత్వం అందించేందుకు ప్రణాళిక చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, డోర్నకల్, మరిపెడ,కురవి, చిన్నగుడూర్, నర్సిహూలపేట, దంతాలపల్లి తెరాస మండలాధ్యక్షులు నున్న వెంకటరమణ, సత్యనారయణ రెడ్డి, తోట లాలయ్య, ధన్ సింగ్ దేవేందర్, వేణు కుడితి మహేందర్, ఎంపీపీలు బాలు నాయక్, గుగుతోల్ అరుణ రాంబాబు,సుశీల్ యాదగిరి రెడ్డి,శారధ రవీందర్, సునీత మురళీధర్ రెడ్డి, కోటిలింగం, అశోక్ రెడ్డి, మంగపతి రావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

Descrizione di Sustanon: Tutto ciò che devi sapere sulla terapia sostitutiva ormonale mas

Bhavani

క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ పండుగ

Satyam NEWS

కార్గిల్ అమర వీరుడి ఇల్లు దోచుకున్న దొంగలు

Satyam NEWS

Leave a Comment