కెనడా, మెక్సికో మరి కొన్ని దేశాల నుండి వచ్చే అన్ని దిగుమతులపై 25 శాతం కస్టమ్స్ టాక్స్ విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ హెచ్చరించిన నేపథ్యంలో అంతర్జాతీయంగా పలు మార్పులు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిసేందుకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఫ్లోరిడాకు వెళ్లినట్లు వార్తలు వెలువడుతున్నాయి. కెనడా వార్తా సంస్థ గ్లోబల్ న్యూస్ ఈ విషయాన్ని వెల్లడించింది. ట్రంప్ ప్రయివేట్ ఎస్టేట్ అయిన మారా-లాగో ఎస్టేట్‌లో ఈ సమావేశం జరుగుతున్నది. సరిహద్దు దేశాలతో వలసల సమస్యలు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ తదితర అంశాలపై చర్యలు తీసుకునే వరకూ వాణిజ్యపరమైన ఆంక్షలతో కూడిన నిర్ణయాలు తీసుకోవద్దని ఆయా దేశాలు కోరుతున్నాయి. ఇందులో భాగంగానే ట్రూడో కూడా ట్రంప్ తో భేటీ అవుతున్నారు. ట్రంప్ ఇప్పటికే మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ తో ఒక ఫోన్ సంభాషణ నిర్వహించారు. ఈ ఫోన్ కాల్‌లో, రెండు దేశాలు కూడా సానుకూలత వచ్చిందని అంటున్నారు.
previous post
next post