భారతీయ-అమెరికన్, వెంచర్ క్యాపిటలిస్ట్ శ్రీరామ్ కృష్ణన్‌ను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై సీనియర్ వైట్ హౌస్ పాలసీ అడ్వైజర్‌గా నియమించారు. గతంలో మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, యాహూ, ఫేస్‌బుక్, స్నాప్‌లలో బృందాలకు నాయకత్వం వహించిన కృష్ణన్ వైట్ హౌస్ లో ఇప్పటికే AI పై పని చేస్తున్న డేవిడ్ ఓ సాక్స్‌తో కలిసి పని చేస్తారు. సైన్స్ అండ్ టెక్నాలజీపై ప్రెసిడెంట్ కౌన్సిల్ ఆఫ్ అడ్వైజర్స్‌తో సహా ప్రభుత్వం అంతటా AI విధానాన్ని రూపొందించడంలో, సమన్వయం చేయడంలో సహాయపడతారు. విండోస్ అజూర్ వ్యవస్థాపక సభ్యుడిగా మైక్రోసాఫ్ట్‌లో శ్రీరామ్ తన కెరీర్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కృష్ణన్ మాట్లాడుతూ అమెరికా దేశానికి సేవ చేయగలగడం, డేవిడ్ సాక్స్‌తో సన్నిహితంగా పని చేస్తున్న AI బృందంలో ఉండటం నాకు గౌరవంగా ఉంది అని అన్నారు. కృష్ణన్ నియామకాన్ని ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ స్వాగతించింది. శ్రీరామ్ కృష్ణన్‌ను మనస్ఫూర్తిగా అభినందించారు. డొనాల్డ్ ట్రంప్ ఆయనను వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో సీనియర్ పాలసీ అడ్వైజర్‌గా నియమించినందుకు సంతోషిస్తున్నామని ఇండియాస్పోరా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ జోషిపురా అన్నారు. చాలా సంవత్సరాలుగా, శ్రీరామ్ కృత్రిమ మేధస్సు రంగంలో కృషి చేస్తున్నారు. పబ్లిక్ పాలసీ, అంతర్జాతీయ వ్యవహారాలు, పెట్టుబడులు, సాంకేతికతను మిళితం చేసే కార్యక్రమంలో ఆయన పురోగమిస్తారని ఆశించారు.