37.2 C
Hyderabad
April 19, 2024 14: 32 PM
Slider ప్రపంచం

డోనాల్డ్ ట్రంప్ ప్రకటన: ‘‘నేను గెలిచాను’’

#Trump

అమెరికా అధ్యక్షుడుగా తాను గెలిచినట్లు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్‌ ఇంకా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అధ్యక్ష ఎన్నికల బరిలో పోటీపడుతోన్న ట్రంప్, బైడెన్ మధ్య విజయం దోబూచులాడుతోంది.

అయితే మనం గెలిచాం అని డోనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జోబైడెన్ 224 ఎలక్టోరల్ ఓట్లతో ముందుండగా, ట్రంప్‌ 213 ఓట్లతో కొనసాగుతున్నారు. 270  ఎలక్టోరల్ ఓట్లు ఎవరు సాధిస్తే వారు విజయం సాధిస్తారు.

ఇద్దరి మధ్య తేడా స్వల్పంగానే ఉండడంతో ఉత్కంఠ కొనసాగుతోంది.మరోవైపు ట్రంప్, బైడెన్ ఇద్దరూ తమ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘మనం గెలుపు దిశగా పయనిస్తున్నాం’ అని జో బైడెన్ అన్నారు.

తామే గెలుస్తామని, ఈ రోజు రాత్రి ఓ ప్రకటన చేస్తామని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు ట్వీట్ చేశారు. ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైన ఫలితాలకు భిన్నంగా ఈ ఫలితాలు వస్తున్నాయి.

Related posts

అంబర్ పేట ప్లేగ్రౌండ్ లో వాకర్స్ తో ఎమ్మెల్యే కాలేరు సమావేశం

Satyam NEWS

గ్రాండ్ గా మార్చి 3 న ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా “రిచిగాడి పెళ్లి”

Satyam NEWS

రీసెర్వ్డ్:రైల్ లో పరమేశ్వరునికి ప్రత్యేక బెర్త్

Satyam NEWS

Leave a Comment