38.2 C
Hyderabad
April 25, 2024 14: 04 PM
Slider తెలంగాణ

టీఎస్ఎఫ్సీఓఎఫ్‌కు ప్ర‌థ‌మ బ‌హుమ‌తి

Fisheres

వరల్డ్ ఫిషరీస్ డే సందర్భంగా కేంద్ర మత్స్య శాఖ నుండి ఇన్ లాండ్ క్యాటగిరీలో తెలంగాణ స్టేట్ పిషర్ మెన్ కోఆపరిటివ్ సోసైటీస్ ఫెడరేషన్ లిమిటేడ్ ప్రథమ బహుమతి పోందినందుకు గాను రాష్ట్ర మత్స్య శాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అభినందించారు. ఇన్ లాడ్ క్యాటగిరీలో ఫిషరీ మెమ్ కోఆపరిటివ్ సోసైటీస్ ఫెడరేషన్ లిమిటేడ్ కు రూ.5 లక్షల నగదు పురస్కారం, మెమొంటో, ప్రశంసా పత్రం లభించాయి.

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్రంలో కాలేశ్వరం లాంటి భారీ నీటి పారుదల ప్రాజెక్ట్ చెరువలలో పెరిగిన నీటి లభ్య‌త వలన ఇన్ లాండ్ ఫిషరీకి అవకాశాలు ఉన్నాయన్నారు. మత్స్య శాఖ అధికారులు భవిష్యత్ లో ఇదే ఉత్సాహన్ని కొనసాగిస్తూ మత్స్యశాఖ ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయాలని కోరారు. అవార్డు లభించిన సందర్భంగా మత్స్యశాఖ అధికారులు సి.యస్ ను కలిశారు.

ఈ కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Related posts

మళ్లీ తల్లి కాబోతున్న కరీనా కపూర్

Satyam NEWS

యాజమాన్యం తప్పిదం వల్లే ఎస్పిఎం పరిశ్రమ దుర్ఘటన

Satyam NEWS

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Satyam NEWS

Leave a Comment