28.7 C
Hyderabad
April 25, 2024 03: 59 AM
Slider వరంగల్

సోలార్ పరికరాల ఉపయోగంతో విద్యుత్ ఆదా

#mulugu

ములుగు మండలంలోని పతిపల్లి గ్రామంలో టీఎస్ రెడ్కో  చైర్మన్   వై. సతీష్ రెడ్డి  ఆదివారం  పర్యటించారు. గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయం లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో  తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమర్చిన సోలార్ ఫ్యాన్లను పరిశీలించారు. పంచాయతి సెక్రటరీ తో మాట్లాడి కావాల్సిన పరికరాలు తెలియజేయాల్సిందిగా ఆదేశించారు. సోలార్ పరికరాలు ఉపయోగించడం వలన విద్యుత్ ఆదా చేయగలమని తెలిపారు.

అనంతరం స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసీ నాయకపోడ్ శ్రీ లక్ష్మి దేవర ఆలయానికి వెళ్లి దర్శించుకున్నారు. అనంతరం ములుగు పట్టణంలోని బండి ప్రవీణ్-రజని గార్ల నూతన గృహ ప్రవేశానికి హాజరయ్యారు. అనంతరం ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామంలో ఈ నెల 7న చనిపోయిన సానికొమ్ము వెంకటప్ప రెడ్డి దశదినకర్మకు టీఎస్ రెడ్ కోచ్ చైర్మన్ సతీష్ రెడ్డి ఆదివారం హాజరయ్యారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో  జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్ లతో పాటు ఎంపీటీసీ మహేష్, నవీన్ బాల్గురి నాయకులు ఆది రెడ్డి, ములుగు మాజీ ఎంపీపీ భూక్య మురళి, సానికొమ్ము దిలీప్ రెడ్డి భారత రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణ నుంచి రెమిడిస్వేర్ ఇంజక్షన్ అక్రమ రవాణా

Satyam NEWS

బంగాళాఖాతంలో పెరుగుతున్న ‘అసని’ తుపాను తీవ్రత

Satyam NEWS

జ‌న‌వ‌రి 2న నాద‌నీరాజ‌నం, సుందరకాండ అఖండ పారాయ‌ణం

Sub Editor

Leave a Comment