Slider ఆంధ్రప్రదేశ్

సాధారణ భక్తులూ దూరంగా ఉండండి

Tirupati

ఇక దందా షురూ. ఏమిటా అని ఆశ్చర్య పోతున్నారా? ఎక్కువగా ఆశ్చర్యపోవద్దు. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు ఇటీవల ఏర్పాటు అయింది కదా. జొంబో జెట్ క్యాబినెట్ లాగా 26 మంది సభ్యుల్ని తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టుబోర్డు సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించుకున్నది. మంత్రి వర్గం కన్నా అది ఎక్కువ అనుకోండి అది వేరే విషయం. వారిని వీరినీ అంటూ అందరిని బోర్డులో నియమించేసుకున్న టిటిడి బోర్డు ఇప్పుడు ఆ బోర్డు సభ్యులు ఎందుకు చేరారో ఆ ముఖ్య కార్యక్రమాన్నిపూర్తి చేసేసింది. టిటిడి బోర్డు సభ్యులు భక్తి శ్రద్ధలతో తిరుమల వేంకటేశ్వరుడికి ఏమేం సేవలు ఉండాలి,అవి సామాన్య భక్తులకు సౌకర్యంగా ఎలా ఉండాలి అనే అంశాలపై శ్రద్ధ చూపాలని బోర్డు ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. దర్శనం టిక్కెట్లకు ప్రాధాన్యత ఏర్పడింది. బోర్డు సభ్యులు అందరూ కోట్లకు పడగలెత్తి బిజినెస్ లలో, రాజకీయాలలో తలమునకలై ఉన్న వారే. వారికి కావాల్సిందల్లా దర్శనం టిక్కెట్లే. అందుకే కాబోలు టిటిడి బోర్డు సభ్యులకు దర్శనం టిక్కెట్ల కోటాను ఫైనలైజ్ చేశారు. ఇంకే ముంది స్వామివారి దర్శనానికి ముందు లైన్ లో ఈ జంబో జట్టు బోర్డు మెంబర్ల బంధువులు, స్నేహితులు, వారితో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నవారు, వారితో రాజకీయ సంబంధాలు కలిగిన వారు ఉండిపోతారు. బోర్డు ఖరారు చేసిన కోటా ప్రకారం బోర్డు సభ్యుల కోటా టికెట్లు వీఐపీ బ్రేక్‌ దర్శన టిక్కెట్లు సోమవారం నుంచి గురువారం వరకూ రోజుకు 20 చప్పున కేటాయించారు. శుక్రవారం వారికి కోటా ఉండదు అయితే శని, ఆదివారాల్లో 12 చొప్పున టికెట్లు, రూ.300 సుపథం టికెట్లు 20, వారానికి నాలుగు సుప్రభాతం టికెట్లు కేటాయిస్తారు. సర్వే జనా సుఖినోభవన్తు.  

Related posts

ప్రియ నేస్తం

Satyam NEWS

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ ఎత్తివేత

Satyam NEWS

సినీ దర్శకుడు త్రివిక్రమ్ కారుకు చలానా

Satyam NEWS

Leave a Comment