కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామీజీని టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు ఆదివారం సాయంత్రం తిరుమలలోని కంచి మఠంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్వామీజీ చైర్మన్ ను ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా స్వామీజీ చైర్మన్ తో మాట్లాడుతూ టీటీడీ నూతన ధర్మకర్తల మండలి ఇటీవల తీసుకున్న నిర్ణయాలను అభినందించారు. తిరుమల పవిత్రతను కాపాడే విధంగా , భక్తులకు మేలు చేకూరేలా నిర్ణయాలు తీసుకోవడం ప్రశంసనీయమని తెలిపారు. తిరుమలను మరింత సుందర దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని, వేదవిద్య వ్యాప్తికి కృషి చేయాలని చైర్మన్ కు సూచించారు.
previous post