27.7 C
Hyderabad
April 26, 2024 04: 22 AM
Slider ఆధ్యాత్మికం

తిరుమల తిరుపతి వెళ్లాలనుకుంటున్నారా? ఇది చదవండి

#TTD

తిరుమల వెళ్ళి దైవ దర్శనం చేసుకునే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి రోజు ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో 1000 దైవ దర్శనం టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.  ఏ.పి.ఎస్.  ఆర్.టి.సి బస్సులలో తిరుమలకు వచ్చే ప్రయాణికులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ అమూల్యమైన అవకాశం కల్పించారు.

ఏ.పి.ఎస్. ఆర్.టి.సి బస్సులలో తిరుపతి వెళ్ళు ప్రయాణికులు ఛార్జీతోపాటు 300 రూపాయలు అదనంగా చెల్లించి బస్సులోనే శీఘ్ర దర్శనం టికెట్ పొందవచ్చు.

ప్రతి రోజు ఉదయం 11. 00 గంటలకు, సాయంత్రం 4.00 గంటలకు ఈ శీఘ్ర దర్శనం ఏర్పాటు ఉంది. తిరుమల బస్సు స్టేషన్ చేరుకున్న తర్వాత శీఘ్ర దర్శనం చేసుకోవడానికి ప్రయాణికులకు RTC సూపర్ వైజర్లు సహాయం చేస్తారు. తిరుపతి వెళ్ళు ప్రయాణికులు ముందుగా RTC బస్సులలో శీఘ్ర దర్శనం టికెట్ పొందే అవకాశాన్ని వినియోగించుకోవలసినదిగా ఆర్టీసీ కోరింది.

APSRTC ప్రతి రోజు తిరుపతికి 650 బస్సులు నడుపుతున్నది.  ప్రతి డిపో నుండి తిరుపతికి బస్సు సౌకర్యం ఉంది. బెంగుళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ మొదలైన నగరాల నుండి దైవ దర్శనం కోసం వచ్చే ప్రయాణికులకు ఇది చాలా మంచి సౌకర్యం.

Related posts

తులసి రామ్ నగర్ లో శక్తి కేంద్రం సమావేశం

Satyam NEWS

గజ్వేల్ లో మున్నూరు కాపు మహాసభ సమావేశం

Satyam NEWS

అగ్లీ సీన్స్: అనుచితంగా ప్రవర్తించిన మంత్రులు

Satyam NEWS

Leave a Comment