28.7 C
Hyderabad
April 20, 2024 05: 11 AM
Slider ఆధ్యాత్మికం

టీటీడీ నకిలీ వెబ్‌సైట్ నిర్వాహ‌కుల‌పై కేసు

tirumala

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని ప్రపంచంలో ఎక్కడికైనా డోర్ డెలివరీ చేస్తామని సోషల్ మీడియాలో ప్రచారం చేసిన‌ www.balajiprasadam.com అనే నకిలీ వెబ్‌సైట్ నిర్వాహ‌కుల‌పై తిరుప‌తి ఈస్ట్ పోలీసులు డిసెంబ‌రు 8న కేసు నమోదు చేసినట్టు టిటిడి విజిలెన్స్ అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదాన్నిఅంద‌జేస్తామంటూ డిసెంబ‌రు 6న ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. టిటిడి ఛైర్మ‌న్ వైవి.సుబ్బారెడ్డి ఆదేశాల మేర‌కు వెంట‌నే రంగంలోకి దిగిన విజిలెన్స్‌, ఐటి విభాగాల అధికారులు స‌ద‌రు న‌కిలీ వెబ్‌సైట్‌ను గుర్తించారు. డిసెంబ‌రు 7వ తేదీన సాయంత్రానికి ఈ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయించారు.

ఈ విధంగా భ‌క్తుల‌ను మోసం చేసే చ‌ర్య‌లు చేప‌ట్టినా, టిటిడికి సంబంధించిన అవాస్తవ సమాచారాన్నిసామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినా, ఫార్వర్డ్ చేసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టిటిడి విజిలెన్స్ అధికారులు స్ప‌ష్టం చేశారు.

Related posts

వాట్ ఈస్ దిస్:కమిషనర్ గారు చెత్త ఎత్తి ఎక్కడ పోశారు

Satyam NEWS

ఇటుక బట్టి యజమాని కిడ్నాప్ కేసును ఛేదిస్తాం

Satyam NEWS

10న రాష్ట్ర వ్యాప్తంగా పాలిసెట్-2023

Bhavani

Leave a Comment