తిరుమల తిరుపతి దేవస్థానం ఖజానా నుంచి ఒక వెండి కిరీటం, రెండు బంగారు ఉంగరాలు, రెండు బంగారు నెక్లెస్ లు, ఒక బంగారు నాణెం మాయం అయిన మాట వాస్తవమేనని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వివరణ ఇచ్చారు. ఈ వస్తువులు మాయం కావడానికి అప్పటి ట్రెజరీ ఏఈవో శ్రీనివాసులను బాధ్యులుగా గుర్తించి ఆయన జీతం నుంచి ఏడు లక్షల 36 వేల రూపాయల రికవరీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఇవో తెలిపారు. ఏ అధికారి హయాంలో ఆభరణాలు మాయం అవుతాయో వారి నుంచే రికవరీ చేయడం టిటిడి నిబంధన అని ఆయన తెలిపారు. మరోసారి ఆభరణాలను సరిచూసుకుని తదనుగుణంగా చర్యలు చేపడతామని ఆయన వెల్లడించారు. అదే విధంగా వచ్చే సెప్టెంబర్ నెల అన్ని ఆభరణాలను మళ్లీ తనిఖీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. 15 రోజుల్లో తనిఖీ పూర్తి అవుతుందని ఇవో తెలిపారు. ప్రస్తుతం అయితే రికార్డుల్లో ఉన్న వెండి కన్నా అదనంగా వెండి వస్తువులను గుర్తించామని ఆయన వెల్లడించారు.
previous post
next post