21.7 C
Hyderabad
November 9, 2024 06: 38 AM
Slider చిత్తూరు

టీటీడీ డిసిషన్:85 టన్నుల నాణాలను కరిగిస్తాం

ttd sents 85 tons coins sail melting

పరకామణి లో రాసులు గా పెరుగుతున్న చిల్లర నాణాల బరువును దించుకునే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ గోడౌన్ లో ఉన్న దాదాపు 85 టన్నుల నాణాలను సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్)కు పంపించాలని నిర్ణయించింది. సేలంలోని సెయిల్ కర్మాగారానికి ఫిబ్రవరి తొలి వారంలో ఈ నాణాలను పంపుతామని, ఇవన్నీ ప్రస్తుతం చెలామణిలో లేనివేనని అధికారులు తెలిపారు.

ఇప్పటికే గోడౌన్ లో చెల్లని నాణాలు అధిక స్థలాన్ని ఆక్రమించాయని తెలిపారు.స్థలాభావం తో పటు చెల్లని నాణాలను తీసివేయాలని ఉద్దేశ్యం తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. 2018లో చెల్లుబాటులో ఉన్న నాణాలను 90 వేల బ్యాగుల్లో బ్యాంకులకు పంపిన టీటీడీ, రూ. 30 కోట్ల ఆదాయాన్ని పొందింది. జూలై 2011 తరువాత 25 పైసల కన్నా దిగువన ఉన్న నాణాలన్నీ చెలామణి నుంచి తొలగిన నేపథ్యంలో, టీటీడీ వద్ద ఆ నాణాలు గుట్టలు గుట్టలుగా పేరుకుని పోయాయి. ఈ నాణాలన్నింటినీ కరిగించాలని ఇప్పుడు అధికారులు నిర్ణయించారు.

Related posts

సచివాలయం లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Satyam NEWS

సోషల్ మీడియాకు కొత్త రూల్స్.. కేంద్రం కసరత్తులు..

Sub Editor

పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక అవగాహన

Satyam NEWS

Leave a Comment