విజిలెన్స్ అవగాహన వారోత్సవంలో భాగంగా తిరుమలలో గురువారం టిటిడి విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో వివిధ విభాగాల ఉద్యోగులు సమగ్రతా ప్రతిజ్ఞ చేశారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్ పిలుపు మేరకు “సమగ్రత – ఒక జీవన విధానం” అనే అంశంపై అక్టోబరు 28 నుండి నవంబరు 2వ తేదీ వరకు టిటిడి విజిలెన్స్ అవగాహన వారోత్సవం నిర్వహిస్తోంది. అక్టోబరు 31న ఉక్కుమనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఈ వారోత్సవం నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా గురువారం ఉదయం శ్రీవారి ఆలయ వాహన మండపం వద్ద, దివ్యదర్శనం కాంప్లెక్స్ వద్ద శ్రీవారి ఆలయంలో పనిచేస్తున్న విజిలెన్స్ అధికారులు, నిఘా సిబ్బంది, లడ్డూ కౌంటర్ల సిబ్బంది, త్రిలోక్ సిబ్బంది ఇతర ఉద్యోగులు కలిసి ప్రతిజ్ఞ చేశారు. అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేస్తామని, త్రికరణ శుద్ధితో భక్తులకు సేవ చేస్తామని, టిటిడి ప్రతిష్టకు భంగం కలగకుండా నడుచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. టిటిడి సివిఎస్వో గోపినాథ్ జెట్టి ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో విఎస్వోలు మనోహర్, ప్రభాకర్, ఎవిఎస్వో చిరంజీవి ఇతర నిఘా, భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.
previous post