ఫొటోలో ఉన్న పాపను చూసారా ఎంత చక్కగా ఉంది.అక్కడ ఓ విలయం జరిగిందని ఆ ప్రమాదం లో తానూ చిక్కుకున్నానని తెలియని ఆ పసిపాప తన తల్లి తండ్రులు బ్రతికి ఉన్నారో లేదో తెలియని స్థితి లో ఉంది.టర్కీ భూకంపం దాటికి కూలిపోయిన శిథిలాల నుంచి సజీవంగా ఉన్న మూడేళ్ళ బాలికను 24 గంటల అనంతరం రెస్క్యూ టీమ్స్ రక్షించాయి.అభం శుభం ఎరుగని ఈ చిన్నారి స్వల్ప గాయాలకు గురైన కారణంగా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
పాపా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఈ బాలిక తలిదండ్రులెవరో, బంధువులెవరో వారి ఆచూకీ తెలియడంలేదని రెస్క్యూ టీమ్స్ చెబుతున్నాయి. పాపా కూడా షాక్ కు గురికావడం తో ఎలాంటివివారాలు తెలియజేయడం లేదు. శుక్రవారం టర్కీలో సంభవించిన భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది.ఈ ప్రమాదం లో ఇప్పటికే 29 మంది మరణించగా 1200 మందికి పైగా గాయపడ్డారు. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతగా నమోదైన విలయానికి ఎలాజిగ్ నగరం వణికిపోయింది. భవన శిథిలాలకింద ఇంకా 30 మంది చిక్కుకునే ఉన్నారు.
వీరిని రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి అటు-భూకంపానికి కుప్ప కూలిన భవనాలు, ఇతర కట్టడాలు జరిగిన బీభత్సానికి సాక్షిగా నిలుస్తున్నాయి.