కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల, కార్మికుల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయు) పిలుపు మేరకు దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా నేడు విద్యానగర్ లోని కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ చీఫ్ కమిషనర్ కార్యాలయం వద్ద కార్మిక సంఘాలతో కలిసి టీయుడబ్ల్యుజె పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఐజెయు అధ్యక్షుడు దేవులపల్లి అమర్, జర్నలిస్టు సీనియర్ నాయకుడు కె.శ్రీనివాస్ రెడ్డి, అమర్నాథ్, సత్యనారాయణ, మాజిద్, టీయుడబ్ల్యుజె కె.విరాహత్ అలీ, డిప్యూటి జనరల్ సెక్రటరీ విష్ణుదాస్ శ్రీకాంత్, నగర అధ్యక్ష కార్యదర్శులు నజీర్,శంకర్ లు పాల్గొన్నారు.
previous post
next post