తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్టులు చేసిన పోరాటాన్ని త్యాగాలను ఈరోజు రాష్ట్ర శాసనసభలో వినిపించినందుకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర నాయకత్వం ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ను ఘనంగా సన్మానించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ జర్నలిస్టు ఫోరం నిర్వహించిన పాత్రను రాష్ట్ర శాసనసభలో గుర్తుచేసి జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని క్రాంతి కిరణ్ పెంపొందించారని, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలు సభ దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి మార్గం వేశారని టీయూడబ్ల్యూజే ఎమ్మెల్యే క్రాంతిని కొనియాడింది. తాను ఎక్కడున్నా, జర్నలిస్టుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తానని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో తెంజు రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయిల్, TUWJ రాష్ట్ర కోశాధికారి మారుతీ సాగర్, TUWJ రాష్ట్ర సహాయ కార్యదర్శులు యోగనంద్, అవ్వారి భాస్కర్, బిజిగిరి శ్రీనివాస్, జయప్రకాష్, చిన్నపత్రికల ఉపాధ్యక్షులు ఆగస్టీన్, శ్యామసుందర్ తదితరులు పాల్గొన్నారు.
previous post