జాతీయ, రాష్ట్ర స్థాయిలో జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాడే యూనియన్ ఐజేయూకు అనుబంధంగా ఉన్న టీయూడబ్ల్యూజే అని సంఘం రాష్ట్ర కార్యదర్శి గుండ్రాతి మధు గౌడ్ అన్నారు. ఆదివారం పెబ్బేరు పట్టణంలో నిర్వహించిన పెబ్బేరు, శ్రీరంగాపూర్ మండలాల సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెబ్బేరు ఉమ్మడి మండల విలేకరులు వారి సమస్యలను రాష్ట్ర, జిల్లా నాయకులకు తెలియజేశారు.
ఈ సందర్భంగా మధు గౌడ్ మాట్లాడుతూ.. తాను పూర్వ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ప్రైవేట్ స్కూల్స్ లో చదివే పిల్లల ఉచిత విద్య విషయంలో అప్పటి డీఈవో సుశాంద్ర రావుతో మాట్లాడి ప్రొసీడింగ్స్ ఇప్పించానని చెప్పారు. అలాగే ఎంతోమంది పాత్రికేయులకు అక్రిడిటేషన్తో సంబంధం లేకుండా వైద్యం కూడా ఉచితంగా చేయించామని తెలిపారు. వైద్య విభాగానికి ఒక ప్రధాన సభ్యున్ని కూడా జిల్లా హెడ్ క్వాటర్లో నియమించామని గుర్తు చేశారు.
ఇక ఇండ్ల స్థలాల విషయంలో రాష్ట్రంలోనే పెబ్బేరు మొదటి స్థానంలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. దీనికి కారణం కూడా టీయూడబ్ల్యూజే అని చెప్పారు. చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా జరిగినా కూడా సరి చేసుకుని యూనియన్ ను ముందుకు నడిపించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతి సమస్యను రాష్ట్ర ప్రభుత్వంతో గళమెత్తి జర్నలిస్టులకు కావలసిన విద్య, వైద్యం, అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలపై మొదటి నుంచి కొట్లాడి ఇప్పించిన ఏకైక యూనియన్ మనదే అని పునరుద్ఘాటించారు.
ప్రస్తుతం ఉన్న రాష్ట్ర నాయకులు క్షణ్ణంగా చర్చించి వర్కింగ్ జర్నలిస్టులకు అందరికీ అక్రిడిటేషన్ వచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నామని, అర్హత గల ప్రతి ఒక్కరికి కార్డులు వస్తాయని అన్నారు. ఇప్పుడు వచ్చే అక్రిడిటేషన్ కార్డులో 3 ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. ఒక కార్డుతో అన్ని వసతులు కల్పించే విధంగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ తెలియజేశారు.
పెబ్బేరుకు మొదటి నుంచి కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని, జిల్లాలోనే పెబ్బేరు లో ప్రెస్ క్లబ్ ను ఓ క్రమశిక్షణ మార్గం వైపు తీసుకెళ్తూ వార్తలు రాసే వారికే ప్రముఖ్యత ఇస్తూ ముందుకు తీసుకెళుతున్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బాలవర్ధన్ కు వారి బృందానికి అభినందనలు తెలియజేశారు. అలాగే సీనియర్ పాత్రికేయులకు రాష్ట్రంలో, జిల్లాలో ప్రాధాన్యత ఇస్తానని మాటిచ్చారు.
కార్యక్రమ అనంతరం మొట్టమొదటిసారిగా పెబ్బేరుకొచ్చిన మధు గౌడ్ ను శాలువాతో పెబ్బేరు, శ్రీరంగాపూర్ విలేకరులు ఘనంగా సన్మానించారు. అనంతరం సీనియర్ పాత్రికేయులకు కూడా విలేకరులు సన్మానం నిర్వహించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పెబ్బేరు, శ్రీరంగాపూర్ మండలాల విలేకరులకు పెబ్బేరు, శ్రీరంగాపూర్ ప్రెస్ క్లబ్ ల అధ్యక్షులు బాలవర్దన్, రంగస్వామిలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఊషన్న, బాలస్వామి, పోలిశెట్టి బాలకృష్ణ, పౌర్ణా రెడ్డి, ప్రశాంత్, మాధవరావు, వెంకటన్న గౌడ్, రాజు, మణ్యం, విజయ్, వహీద్, నర్సింహరాజు, రవికాంత్, అంజి, రమేష్ శెట్టి, శ్రీనివాస్, బాలరాజు, రవీందర్ గౌడ్, గోరటి రమేష్, విజయ్ కుమార్, కిరణ్ కుమార్ గౌడ్, రాజేంద్రప్రసాద్, గోపాలకృష్ణ, పరుషరాముడు, చిరంజీవి, అతీక్, టి.జి. శ్రీకాంత్, వేణు సాగర్, వెంకటేష్ గౌడ్, కిట్టు శర్మ, నరేష్, బాలరాజు, హరీష్ గౌడ్, నారాయణ, రాజ్ కుమార్, శ్రీనివాసులు, సురేష్ పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్