31.7 C
Hyderabad
April 18, 2024 22: 56 PM
Slider వరంగల్

ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీయూడబ్ల్యూజే బలోపేతానికి కృషి

#TUWJ

ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీయూడబ్ల్యూజే బలోపేతానికి సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలని అడ్ హాక్ కమిటి నిర్ణయించింది. బుధవారం ములుగు జిల్లా మేడారంలో అడ్ హాక్ కమిటీ సమావేశం కన్వీనర్ బీఆర్. లెనిన్ అధ్యక్షతన జరిగింది.

మార్చి నెలలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సభ్యత్వ నమోదు ప్రారంభించాలని కమిటీ నిర్ణయించిందని ఉమ్మడి జిల్లా అడ్ హాక్ కమిటీ కన్వీనర్ బీఆర్. లెనిన్ పేర్కొన్నారు.   ఆరు జిల్లాలో టీయూడబ్ల్యూజేతో పాటు అనుబంధ సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

కరోనా సమయంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 270మందికి పైగా జర్నలిస్టులకు రూ.20వేల చొప్పున ఆర్ధిక సహాయం అందించి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అండగా నిలిచారని,  ప్రతి జర్నలిస్ట్ అల్లం సర్ కు రుణపడి ఉన్నారని పేర్కొన్నారు.

అన్ని జిల్లాల్లో టీయూడబ్ల్యూజే బలోపేతం చేయాలని లెనిన్ కోరారు. అనంతరం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యూనియన్ తో పాటు ప్రెస్ క్లబ్ లకు కూడా ఎన్నికలు నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది.

Related posts

ప్రొఫెసర్‌ హరగోపాల్‌పై..‘ఉపా’ కేసు దారుణం

Satyam NEWS

తెలంగాణ లో తగ్గుతున్న కరోనా వైరస్ వ్యాప్తి

Satyam NEWS

కరోనా డెత్: మత ఆచారాలను ఉల్లంఘించడం మంచిది కాదు

Satyam NEWS

Leave a Comment