ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయాన్ని మంగళవారం టివి యాంకర్ లాస్య దంపతులు సందర్శించారు.
ఈ సందర్భంగా వారు రామప్ప రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామప్ప దేవాలయ విశిష్టత గురించి ఆలయ గైడ్ వెంకటేష్ వారికి వివరించారు.
రామప్పకు యునెస్కో గుర్తింపు రావడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు.